సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) నటించిన జైలర్‌లో(Jailer) విలన్‌గా నటించిన వినాయకన్‌(Vinayakan) తరచూ వివాదాల్లో కూరుకుపోతుంటాడు. లేటెస్ట్‌గా తాగి న్యూసెన్స్‌ సృష్టిస్తున్నాడన్న కారణంగా కేరళ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. మద్యం మత్తులో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన కంప్లయింట్ మేరకు ఎర్నాకుళం నార్త్‌ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న వినాయకన్‌ వారితో గొడవకు దిగినట్లు తెలుస్తున్నది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) నటించిన జైలర్‌లో(Jailer) విలన్‌గా నటించిన వినాయకన్‌(Vinayakan) తరచూ వివాదాల్లో కూరుకుపోతుంటాడు. లేటెస్ట్‌గా తాగి న్యూసెన్స్‌ సృష్టిస్తున్నాడన్న కారణంగా కేరళ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. మద్యం మత్తులో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన కంప్లయింట్ మేరకు ఎర్నాకుళం నార్త్‌ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న వినాయకన్‌ వారితో గొడవకు దిగినట్లు తెలుస్తున్నది. అతడిని వారించడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు స్టేషన్ బెయిలుపై(Bail) విడుదల చేశారు. పోలీసులు వినాయకన్‌ను అరెస్ట్‌ చేయడం ఇది మొదటిసారేం కాదు. ఇంతకు ముందు ఓ మోడల్‌ను లైంగికంగా వేధించినందుకు పోలీసులు ఇతడిని అరెస్ట్‌ చేశారు. మొన్నామధ్య కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ(Oomen Chandi) మరణించినప్పుడు కూడా వినాయకన్‌ చాలా చెత్తగా వ్యాఖ్యానించాడు. మలయాళీ నటుడైన వినాయకన్‌ తెలుగులో నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన అసాధ్యుడులో నటించాడు. ఆ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించలేదు గానీ కొన్ని డబ్బింగ్‌ సినిమాల్లోని విలన్‌ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఆయనలో డ్యాన్సర్‌, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఉన్నారు.

Updated On 25 Oct 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story