హీరోయిన్‌ ఇలియానా(Ileana) శుభవార్త చెప్పింది. పోకిరీ సినిమాతో అగ్ర కథానాయికగా మారిన ఇలియానా గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఈ నెల 1వ తేదీన పండంటి మగబిడ్డకు(baby boy) జన్మనిచ్చినట్టు సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించింది. తన బిడ్డకు కోవా ఫీనిక్స్‌ డోలన్‌ అనే పేరు పెట్టినట్టు చెప్పింది. బాబు ఫోటోను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రియమైన బాబును ఈ ప్రపంచంలోకి ఆహ్వానించినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను.

హీరోయిన్‌ ఇలియానా(Ileana) శుభవార్త చెప్పింది. పోకిరీ సినిమాతో అగ్ర కథానాయికగా మారిన ఇలియానా గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఈ నెల 1వ తేదీన పండంటి మగబిడ్డకు(baby boy) జన్మనిచ్చినట్టు సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించింది. తన బిడ్డకు కోవా ఫీనిక్స్‌ డోలన్‌ అనే పేరు పెట్టినట్టు చెప్పింది. బాబు ఫోటోను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రియమైన బాబును ఈ ప్రపంచంలోకి ఆహ్వానించినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను. మా మనసులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి’’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలయ్యింది. ఇంతకీ ఇలియానా అతడిని పెళ్లి చేసుకుందా? లేదా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇంతకు ముందే తన భర్త ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. కాకపోతే అతడి పేరు, ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. అయితే బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఆ వ్యక్తి పేరు మైఖేల్‌ డోలన్‌ అని తెలుస్తోంది. అతడితో దాదాపు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ఇలియానా ఈ ఏడాది మే 13వ తేదీన రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుందని సమాచారం. ఇలియానా గర్భం ధరించినట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించడానికి ఓ నెల రోజుల ముందు పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. గతంలో కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందని రూమర్స్‌ వచ్చాయి. దేవదాస్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా చివరగా 2018లో అమర్‌ అక్బర్‌ ఆంథోనీ సినిమాతో రవితేజకు జోడిగా కనిపించింది.

Updated On 7 Aug 2023 8:36 AM GMT
Ehatv

Ehatv

Next Story