రామబాణం(Rama Banam), ఉగ్రం(Ugram) సినిమాలతో పాటు ఈ రోజున కేరళ స్టోరీ(Kerala Stories) కూడా రిలీజ్ అయింది. ప్రసాద్ ఐమాక్స్(Prasad Imax) ధియేటర్‌లో, ధియేటర్ బైట కూడా పోలీస్ పహారా(Police protection), బందోబస్తు హడావుడిగానే జరిగింది. చాలా మందికి ఎందుకు సినిమా ధియేటర్‌లో పోలీస్‌ల పర్యవేక్షణ ఎందుకో బోధపడలేదు.
రామబాణం(Rama Banam), ఉగ్రం(Ugram) సినిమాలతో పాటు ఈ రోజున కేరళ స్టోరీ(Kerala Stories) కూడా రిలీజ్ అయింది. ప్రసాద్ ఐమాక్స్(Prasad Imax) ధియేటర్‌లో, ధియేటర్ బైట కూడా పోలీస్ పహారా(Police protection), బందోబస్తు హడావుడిగానే జరిగింది. చాలా మందికి ఎందుకు సినిమా ధియేటర్‌లో పోలీస్‌ల పర్యవేక్షణ ఎందుకో బోధపడలేదు. కొందరు గుసగుసలాడుకున్నారు-ఇక్కడెందుకు పోలీసులున్నారని. సినిమా చూడ్డానికి వచ్చారని కొందరు అనుకున్నారు. సగటు ప్రేక్షకుడికి కేరళ స్టోరీలో గొడవ గురించి తెలియకపోతే వాళ్ళని సులభంగా క్షమించేయొచ్చు. బాగా చదువుకున్నవారికే కేరళ స్టోరీ గురించి కొంత లేటుగా తెలిసింది.
కేరళ స్టోరీలో స్టోరీ ఏంటంటే....
ఈ మద్యన ఇండియా పలు రాష్ట్రాలలో హిందూ(Hindu) మహిళలను నయాన్నో, భయాన్నో, సామదానబేదదండోపాయాలతో ముస్లిం(Muslim) మతంలోకి(Relegion) మార్పిడి చేసి, ముస్లిం దేశాలకు ఉద్యోగాల ముసుగులో పార్సిల్ చేసి పంపించే ముస్లిం సంస్థలు తయారయ్యాయనే వార్తలు యుద్ధమేఘాల్లా కమ్ముకొచ్చాయి. అలా ఉద్యోగం ఆశతో కొందరిని, ప్రేమలు, పెళ్ళిళ్ళు పేరుతో కొందరిని ఊబిలోకి దించి, తర్వాత వీలున్న ముస్లిం దేశాలకు పంపిన అనంతరం వారిని జీహదీలుగా, వ్యభిచారులుగా మార్చి, వారిని అంతం చేసేస్తున్న ఉదంతాలు దేశం నిండా కనిపిస్తున్నాయన్నది వార్తాకథనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ వైనం ఎక్కువుగా కేరళ రాష్ట్రంలోనే చోటు చేసుకుంటున్న నేపధ్యంలోనే కేరళ స్టోరీ చిత్రం తెరకెక్కింది. కేరళ రాష్ట్రం నుంచే ఎక్కువమంది మహిళలు ఈ అరాచకానికి బలి అవుతున్నారన్నది తాజా సర్వే. అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నమోదైన కేరళ నుంచే అధికశాతం మహిళలు బైట రాష్ట్రాలకు, విదేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడానికి సమాయత్తమై ఉంటారు, హాస్పిటల్స్ అండ్ హాస్పిటాలిటీ విభాగాలలో కేరళ స్త్రీలు ప్రపంచమంతా కనిపిస్తారు. అందుకే అరాచకవాదులు అమితంగా కేరళ రాష్ట్రంపైనే దృష్టి కేంద్రీకరించిన కారణంగా బలైపోతున్న మహిళల సంఖ్య అసంఖ్యాకంగా కేరళలోనే నమోదవడం గమనార్హంగా చెబుతుంటారు. ఈ విషయాన్ని కేరళ మాజీ ముఖ్యమంత్రి కూడా గతంలో ఒకసారి బలపరిచిన దాఖలాలు కూడా ఉన్నాయన్నది కూడా నిజమే. అందుకే ఈ వాస్తవాల సంఘటనలే కేరళ స్టోరీ చిత్రానికి ప్రధానస్ఫూర్తిగా నిలిచాయి.
కేరళ స్టోరీ చిత్రంపై ప్రధాని మోది స్పందన
కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో తన పర్యటనలో హాజరైన సభలో కేరళ స్టోరీ గురించి ప్రత్యేకంగా స్పందించారు. ‘’బాంబులు, తుపాకులు, మతన్మోద ముస్లిం సంస్థలు సృష్టించే పేలుళ్ళు శబ్దాన్ని సృష్టిస్తాయి. మనకి ఆ చప్పుడు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు చప్పుడు చేయవు. ముస్లింవాదులు చేస్తున్న, ప్రస్తుతం ఒడిగడుతున్న అరాచకాలను కేరళ స్టోరీ ప్రతిబింబిస్తోంది’’అని బాహాటంగానే మాట్లాడారు.
కాశ్మీర్ ఫైల్స్(Kashmir Files) బాటలోనే...
కాశ్మీర్ ఫైల్స్ లాటి సినిమా రావడమే ఒక సంచలనంగా మారింది. సినిమాని అసేతుహిమాచలం అందరూ చూసి విపరీతంగా మెచ్చుకోవడంతో వసూళ్ళ పెనుతుఫానే రేగింది. అత్యంత సాహసోపేతంగా కాశ్మీర్ ఫైల్స్‌ని తెరకెక్కించారు దర్శకనిర్మాతలు. అంతకంతా అభినందనలతో పాటు లాభాలు కూడా గడించారు. అన్ని భాషలలోనూ కాశ్మీర్ ఫైల్స్ బంపర్ కలెక్షన్స్‌నే చవిచూసింది. అంటే అంత స్పందన లభించిందని అర్ధం. అలాగే ఇప్పుడు కేరళ స్టోరీ కూడా పెద్ద దుమారాన్నే లేపుతుందని అందరూ అంచనాలు కడుతున్నారు.
నాగేంద్రకుమార్