95వ ఆస్కార్‌ 2023 అవార్డ్స్‌లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డ్ ఓ తెలుగు సినిమాకు రావడం ఎంతో గర్వకారణమంటూ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు..

95వ ఆస్కార్‌ 2023 అవార్డ్స్‌లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు. సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డ్ ఓ తెలుగు సినిమాకు రావడం ఎంతో గర్వకారణమంటూ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.. మరోవైపు పలువురు పొలిటికల్ దిగ్గజాలు కూడా RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. ....ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహణ్ రెడ్డి ., ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ట్వీట్లు చేసారు.

ఆర్ ఆర్ ఆర్‌కు ఆస్కార్ రావడం పట్ల దేశ ప్రధాని మోదీ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ఆర్ ఆర్ ఆర్‌కు ఆస్కార్ రావడం పట్ల దేశ ప్రధాని మోదీ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానీ మోదీ తన ట్వీట్‌లో రాస్తూ.. ఇది అసాధారణమైన విజయం. ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది. అభినందనలు కీరవాణీ, చంద్రబోస్ అంటూ ట్వీటారు.

RRR చిత్రం విశ్వసినీ యావనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు . అస్కార్ అవార్డు స్పూర్తితో తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొగసాగించాలన్నారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందన్నారు. ప్రతిష్టాత్మక అస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణమని కేసీఆర్ కొనియాడారు . నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు తెలంగాణ సంస్కతి తెలుగు ప్రజల అభిరుచికి ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయన్నారు .

తెలుగు సినిమా సత్తాను విశ్యవ్యాప్తం చేసిన RRR మూవీ టీమును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబినందించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట్ అవార్డు గెలుచుకోవడం సంతోషం ..రాహుల్ సిప్లిగంజ్ , కాలబైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్కకులకు సైతం మంత్ర ముగ్ధులను చేసిన పాట ఇది . అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది . ఇటీవలే శతాబ్ధి ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చింది అని ట్వీట్ చేశారు .

ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ కు అభినందనలు అంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు . అకాడమీ అవార్డుల ప్రదానోత్సంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు దక్కించుకుని నాటు నాటు ఖ్యాతి గడించింది. భారతీయ చిత్రానికి గర్వించే సమయం ఇది . రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ , కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ , ప్రేమ్ రక్షిత లకు కంగ్రాట్స్ అంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ RRR మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు . భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు అభినందనలు . ఈ వార్త విని ఎంతో సంతోషించాను . ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన నాటు నాటు ప్రపంచం వ్యాప్తంగా అందరిని డ్యాన్స్ చేయించేలా చేసింది. ప్రతిష్టాత్మక స్టేజీపై పాటను ఆలపించడం...అవార్డును అందుకోవడంతో భారతీయ సినిమా ఖ్యాతి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత సొంతం అయ్యేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి, నటులు , రామచరణ్, ఎన్టీఆర్ , గాయకులు రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నిర్మాత డీవీవీ దానయ్య మూవీ టీమ్ అందరికి నా అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Updated On 13 March 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story