యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) ఆంజనేయ మాలలో(Anjaneya Swamy Mala) కనిపించారు. మాస్ సినిమాలు చేసే విశ్వక్ సడెన్ గా ఇలా భక్తుడిగా కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) ఆంజనేయ మాలలో(Anjaneya Swamy Mala) కనిపించారు. మాస్ సినిమాలు చేసే విశ్వక్ సడెన్ గా ఇలా భక్తుడిగా కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

కాంట్రవర్సీలకు ముందుంటాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్. వివాదాలతోనే తన సినిమాలకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది. అంతే కాదు మల్టీ టాలెంటెడ్ స్టార్ అని కూడా నిరూపించుకున్నాడు విశ్వక్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం.. దాని వల్ల వచ్చిన సమస్యలతో కాంట్రవర్సీలలో ఇరుక్కోవడం విశ్వక్ కు అలవాటే. ఇక ఈ హీరో సరికొత్తగా కనిపించారు. మాస్ హీరోగా.. కాంట్రవర్షియల్ స్టార్ గా పేరున్న విశ్వక్.. భక్తి మార్గంలో కి మారారు. తాజాగా ఆంజనేయ మాలలో కనిపించారు.

వరుస సినిమాలు తెరకెక్కిస్తూ.. సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. సినిమాల విషయంలో ధైర్యంగా ప్రయోగాలు చేయాలి అంటే అది అతనికే సాధ్యం. ఓ పక్క వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ రీసెంట్ గా హోస్ట్ అవతారం ఎత్తాడు. ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా(Family Dhamaka) అనే షోని కూడా మొదలుపెట్టాడు.

ఇక త్వరలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.ఈమూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్. ఇక తాజాగా విశ్వక్ సేన్ కు సబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్.. భక్తి మార్కంలోకి వచ్చాడు. ఆయన ఈసారి ఏకంగా ఆంజనేయ మాలలో కనిపించారు. ఆహా ఫ్యామిలీ ధమాకా షో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొనగా ఆంజనేయ స్వామి మాల దుస్తుల్లో కనిపించారు.

అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా తన ఫోటోని పోస్ట్ చేసి జై భజరంగ్ బలి అని రాశారు విశ్వక్. దీంతో ఆంజనేయ స్వామి మాలలో ఉన్న విశ్వక్ సేన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎప్పుడు ఫైర్ గా ఉండే విశ్వక్ లో.. భక్తి కోణం కూడా ఉందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Updated On 27 Sep 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story