వాల్తేర్ వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి(Chiranjeevi) చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని(Perni Nani) కౌంటర్ ఇచ్చారు. 'వాల్తేర్ వీరయ్య 200 రోజులు ఆడినందుకు సంతోషంగా ఉంది. నేను కూడా చిరంజీవి ఫ్యాన్‌నే! వ్యక్తిగతంగా చిరంజీవికి పిచ్చి అభిమానిని. చదువుకునే రోజుల్లో చిరంజీవి పోస్టర్లకు దండలు కూడా వేశాను. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎంత దూరమో, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం.
వాల్తేర్ వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి(Chiranjeevi) చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని(Perni Nani) కౌంటర్ ఇచ్చారు. 'వాల్తేర్ వీరయ్య 200 రోజులు ఆడినందుకు సంతోషంగా ఉంది. నేను కూడా చిరంజీవి ఫ్యాన్‌నే! వ్యక్తిగతంగా చిరంజీవికి పిచ్చి అభిమానిని. చదువుకునే రోజుల్లో చిరంజీవి పోస్టర్లకు దండలు కూడా వేశాను. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎంత దూరమో, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. నా అభిమాన హీరోకే చెబుతున్నాను. ఆయన పారితోషికాల గురించి మేము మాట్లాడలేదు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు. సినిమాను సినిమాలాగే చూడాలి. అలాగే రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలి. ఇతర సినిమా హీరోల గురించి మేము ఎప్పుడైనా మాట్లాడామా? చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ ల గురించి మేము మాట్లాడలేదు. సినిమా వాళ్లు అందరూ వేరు. పవన్‌కల్యాణ్ వేరు. సినిమాలో అంబటి రాంబాబుపై కక్ష సాధింపు కోసం పాత్ర సృష్టించినప్పుడు తప్పదు మరి.. గిల్లినప్పుడు, గిల్లించుకోవాలి' అని పేర్ని నాని అన్నారు.