పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే పేరుతో చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించడం వెనుక ఉన్న తన వ్యూపాయింట్‌ని టీజి వివరిస్తూ, సినిమా మేకింగ్‌ పట్ల పేషన్‌తోనే ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టానని, మున్ముందు అమెరికాలోనే తెలుగు సినిమాలు నిర్మించాలని అనుకున్నా, తర్వాత ఇక్కడే నిర్మించాలనే నిర్ణయమార్పు కారణంగా హైదరాబాద్‌నే ప్రధానంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. క్రాస్‌ ఓవర్‌ ఫిల్మ్స్‌ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్‌ ఆర్డిస్టులతో, అనుష్క, మాధవన్‌ కాంబోలో నిశ్శబ్దం చిత్రాన్ని నిర్మించినట్టుగా కూడా తెలియజేశారు.

ఎంతటి గొప్పవాడైనా సరే ఒక రంగంలోనే స్టార్‌ డమ్‌ని సాధించడం ఎంతో కష్టం. ఎన్నో ఏళ్లు పడితేగానీ ఆ స్టార్‌డమ్‌కి అతీగతీ ఉండవు. అలాటిది ఒక రంగంలో స్టార్‌గా ఎదిగి, అవలీలగా మరో రంగంలో సూపర్‌స్టార్‌గా ఎదగడమంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అదీ మొదటి రంగంతో పూర్తిగా ఏమాత్రం సంబంధం లేని మరో రంగం అయితే అది మరీ క్లిష్టతరం. అటువంటి అసాధ్యమైన పనులలో ఏకకాలంలో ఘనవిజయం సాధించడమంటేనే అది నిజమైన, స్వచ్ఛమైన, ఖచ్చితమైన గ్రేట్‌నెస్‌గా పరిగణించాలి. ఆ గ్రేట్‌నెస్‌కి అసలుసిసలు నమూనా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత, అగ్రనిర్మాతల జాబితాలో అనతికాలంలోనే చోటు సంపాదించుకున్న టీజి విశ్వప్రసాద్‌. అమెరికాలో టెక్నాలాజికల్‌ సర్వీసెస్‌ వ్యాపారంలో విజయపథంలో దూసుకుపోతున్న టిజి విశ్వప్రసాద్‌ దృష్టి చిత్రనిర్మాణ రంగంపైన పడింది. దాదాపు రెండుమూడు సంవత్సరాలపాటు శాస్త్రీయమైన విధానంలో చిత్రపరిశ్రమ తీరుతెన్నులను పరిశీలించి, సమీక్షించుకుని అచితూచి అప్పుడు అడుగుపెట్టిన టీజీ తెలుగు చిత్రపరిశ్రమలో విజయపరంపరను కొనసాగిస్తున్నారు. మొన్నీ మద్యనే మాస్ మహారాజ్‌ రవితేజతో వందకోట్ల బ్లాక్‌బస్టర్‌ ధమాకా నిర్మించి, ఇప్పుడు గోపీచంద్‌, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రామబాణం విడుదలకు సిద్ధం చేస్తున్న టీజీ మొన్నీమధ్యనే మీడియాతో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.

100 చిత్రాల మైల్‌స్టోన్‌ని చాలా ఫాస్ట్‌గా చేరుకుంటాం : టిజి విశ్వప్రపాద్‌

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే పేరుతో చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించడం వెనుక ఉన్న తన వ్యూపాయింట్‌ని టీజి వివరిస్తూ, సినిమా మేకింగ్‌ పట్ల పేషన్‌తోనే ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టానని, మున్ముందు అమెరికాలోనే తెలుగు సినిమాలు నిర్మించాలని అనుకున్నా, తర్వాత ఇక్కడే నిర్మించాలనే నిర్ణయమార్పు కారణంగా హైదరాబాద్‌నే ప్రధానంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. క్రాస్‌ ఓవర్‌ ఫిల్మ్స్‌ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్‌ ఆర్డిస్టులతో, అనుష్క, మాధవన్‌ కాంబోలో నిశ్శబ్దం చిత్రాన్ని నిర్మించినట్టుగా కూడా తెలియజేశారు.

ఐటి బిజినెస్‌ కన్నా సినిమారంగంలో ప్రాఫిట్‌ రేట్‌ ఎక్కువనీ, రిస్క్ ఫాక్టర్‌ మినిమమ్‌ అనే ఆలోచనలతోనా సినిమా రంగంవైపు దృష్టి మరల్చారు అనే ప్రశ్నకు సమాధానంగా, ‘’ అలా కాదు. సినిమా రంగానికి వచ్చిన ప్రధాన కారణం నాకు సినిమాల మేకింగ్‌ పట్ల ఉన్న ఆకర్షణ, పేషనే కారణం. కానీ నా ఐటి బిజినెస్‌తో సినిమా బిజినెస్‌ని పోల్చలేను. ఇప్పటికీ నా టెక్నాలాజికల్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ కొనసాగుతూనే ఉంది. అదీ చాలా సక్సెస్‌ఫుల్‌గా. సినిమా రంగంలో కూడా సక్సెస్‌ఫుల్‌గానే ఉన్నా. కానీ చెప్పాలంటే ఐటి ఎప్పటికైనా సినిమా కన్నా మోర్‌ ప్రాఫిటబుల్‌ అని మాత్రం చెప్పగలను.’’ అన్నారు.

ప్రొడ్యూసర్‌ అంటే కథలు వినడం గానీ, క్రియేటివ్‌ సైడ్‌ కన్నాకూడా క్యాషియర్‌ అన్న నానుడి కూడా పరిశ్రమలో ఉంది. మీరు ప్లే చేసే పార్ట్ ఎలా ఉంటుంది?-అనడిగితే విశ్వప్రసాద్‌ చాలా చురుగ్గా స్పందించి, సమాథానం చెప్పారు. ‘’నేను వేరే వాళ్ళ గురించైతే కామెంట్‌ చేయలేను గానీ, నా వరకూ అయితే మాత్రం నేను గానీ, మా విధానంగానీ అలా ఉండదు. పైనాన్షియర్‌ అని, క్యాషియర్‌ అనే మోడల్‌ ససేమిరా కాదు. ఫ్యాక్టరీ అని పెట్టడంలోనే ఉంది. సినిమా చేయడంలో రీయూజబుల్‌ ఏముంది, మల్టిపుల్‌ ప్రాజెక్ట్స్ చేయడానికి ఉన్న ఇకో సిస్టమ్‌ ఏముంది అనే కోణంలో we are building from the scratch. We just don’t make only films. We have invested into outdoor units, invested into studios, back end processలో గానీ, సాఫ్ట్‌వేర్‌కి కావాల్సిన సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నాం. జస్ట్ సినిమాని మౌంట్‌ చేసి వదిలేయం. సెకండ్‌...క్రియేటివ్‌ సైడ్‌ నేను ఇంటర్‌ఫియర్‌ అవను. ఏదైనా బిఫోర్‌ ప్లానింగే చూసుకుంటాం. ప్లాన్‌ చేశాక, కంప్లీట్‌ ఫ్రీడమ్‌ డైరెక్టర్‌కి ఇచ్చేస్తాం.’’ అని తాను అమలు చేసిన విధానం గురించి పెరఫెక్టుగా, తడుముకోకుండా టీజి వివరించారు.

మీకు వివేక్‌గారికీ చాలా బాండింగ్‌ ఉంది. సినిమాని సెలెక్ట్‌ చేయడంలో గానీ ప్రారంభించడానికి గానీ మీరిద్దరిలో ఎవరు ఏ రోల్ ప్లే చేస్తారు అని అడిగితే :-

మూవీ సెలెక్ట్‌ చేయడంలో ఓ రూల్‌ అని ఫాలో అవడానికి లేదు. చాలా ఈక్వేషన్‌లుంటాయి అందులో. ఇమేజ్‌ మీద, కొన్ని స్టోరీల మీద, కొన్ని కాంబినేషన్‌ల మీద వెళ్తాయి. కొన్ని ఇన్నోవేటివ్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. గూఢచారి చేసినప్పుడు అదే జరిగింది. అక్కడ ఫార్ములా లేదు. ఇమేజ్‌ కూడా లేదు. కాన్సెప్ట్ మీద వెళ్ళాం. ప్రత్యేకంగా ఓ ఫార్ములా అని లేదు. అన్ని కాంబినేషన్స్, కాన్సెప్ట్స్ చేస్తాం. ఓన్లీ పెద్ద సినిమాలు చేయాలనే లేదు. చిన్న సినిమాలనీ లేదు. బ్యాలెన్స్‌తోనే ఏది చేసినా.’’ అని అన్నారు.

కొన్నాళ్ళ క్రితం సినిమా మేకింగ్‌ వేరు ఇప్పుడ సినిమాల టోన్ మారింది. ఏ కథనైనా కొత్తగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఫాలో అవుతున్నారా? అన్న ప్రశ్నకు టీజి సమాధానం చెబుతూ :-

అలా ఫాలో అవడానికి కూడా ఏమీ లేదు. There is neither a formula, nor a trend as it is. A genre may work out one year ago, it many not work out now. ఇప్పుడు మేం చేసిన రామబాణం కంప్లీట్‌ ఫామిలీ డ్రామా విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’’ అని క్లియర్‌ చేశారు. మీరు పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, అలాగే రీసెంట్‌గా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి లాటి సినిమాలు కూడా చేశారు. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయిలాటి సినిమాలను కూడా చేస్తున్నారు. రియల్లీ గ్రేట్‌. ఈ నేపథ్యంలో సక్సెస్‌ అండ్‌ ఫెయిల్యూర్స్ మీద మీ కామెంట్ ఏమిటి..?

ఇందులో రెండు యాంగిల్స్ ఉన్నాయి. లోగడ కూడా చెప్పాను. కార్పొరేట్‌ ప్రాసెస్‌ని లెవెల్‌ చేసి we are building a core interest. That has nothing to do with failures and success. Diversified films చెయ్యడానికి గానీ, లార్జ్ మూవీస్‌ చేయడానికైనా రెడీ. నేను బేసిక్‌గా సినిమాల్లోకి వచ్చిందే కేవలం పేషన్‌తో.చిన్నప్పట్నుంచీ అందరిలాగే మన తెలుగురాష్ట్రాలలోవారిలాగే నేనూ రెగ్యులర్‌గా సినిమాలు చూస్తుండేవాడిని. యూఎస్‌కి వెళ్ళి ఓ 30 ఏళ్ళవుతోంది. అక్కడ కూడా అందరితోనూ టచ్‌లో ఉండేవాడిని. ఆర్ట్‌కి సంబంధించిన వారిని, ఆర్ట్‌కి సంబంధమైన కార్యక్రమాలనీ నేను టేకప్‌ చేసేవాడిని. అది సహజంగానే నాలో ఓ రకమైన ఆసక్తిని సినిమాలపైన రేకెత్తించింది. ఓ బిజినెస్‌లోకి రావాలంటే ఆ బిజినెస్‌లో అన్నీ చేయాలి. You need to do innovative films, large commercial films. We cannot underline success every time. We have to put best efforts for chasing success. Some may not hit. If your process driven in planning, not in making. ప్లానింగ్‌లో అయితే మాత్రం మేము well structured with good brains. ఇప్పటివరకూ అయితే మంచి రేటాఫ్‌ సక్సెస్‌లోనే ఉన్నాం.

ప్రొడక్షన్‌ హౌస్‌గా మీరు చాలా బిగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఎగ్జిబిషన్‌ వైపుకి కూడా వెళ్ళే ప్లాన్‌ కూడా ఏదైనా ఉందా.?

మేం ఓటిటికైతే కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్నాం. జీ ఓటీటీకి చేస్తున్నాం. ప్రతీ సినిమాకి నాన్‌ ధియేట్రికల్‌ బిజినెస్‌ ఉంటుంది. ఓటిటి బిజినెస్‌లోకైతే వెళ్ళే ఐడియా అయితే లేదు. ఎకో సిస్టమ్‌ అయితే we are seriously investing into everything. Anything related to the film infrastructure, we started investing into and we will grow in those areas.

మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కదా...

మా అమ్మాయికైతే ఇంట్రస్ట్ ఉంది. పిల్లలిద్దరూ పుట్టడం, పెరగడం అంతా అమెరికాలోనే. మా అబ్బాయి టెక్‌ సైడ్‌ బిజినెస్‌లో ఉన్నాడు. మా అమ్మాయికైతే కొంత ఇంట్రస్ట్ ఉంది. అదెంత వరకో చూడాలి. ప్రస్తుతానికి శర్వానంద్‌గారితో లండన్‌లో ఓ సినిమా చేస్తున్నాం. అందులో అయితే మా అమ్మాయి ఇన్వాల్వ్ అయింది.

పవన్ కళ్యాణ్‌గారితో సినిమాకి టైటిల్‌ అనుకున్నారా : లేదింకా అనుకోలేదు.

ఈ మధ్య మీరు...ఈటీవికి అలా మొదలైంది అని షో స్టార్ట్ చేశారు కదా..

అసలు మేము పీపుల్స్ మీడియా స్టార్ట్ చేసిందే ఈటీవి పాడుతా తీయగా ప్రొగ్రాంతోనే. మూడేళ్ళు యుస్‌లో పాడుతా తీయగా ప్రోగ్రాం రన్‌ చేశాం. బాపినీడుగారితో వర్క్ చేశాం. అంటే వెరీవెరీ ఎర్లీ డేస్‌లో. అప్పట్నుంచీ ఇంట్రస్ట్ ఉండేది టీవీ షోలు చేయాలని. ఇది జస్ట్ రీస్టార్ట్.

మీ ప్రాంతం నుంచి సినిమా ఇండస్ట్రీకి చాలా గ్రేట్‌ పీపుల్‌ వచ్చారు. కెవిరెడ్డిగారు. నాగిరెడ్డిగారు. డొరస్వామిరాజుగారు. ఇలా వారిలో ఎవరైనా ఇన్సిపిరేషన్‌ ఉన్నారా?

(నవ్వుతూ)...బేసిక్‌గా సినిమా అన్నదే ఇన్సిపిరేషన్‌. ఎప్పుడో నాలో ఆ వెతుకులాట ప్రారంభమైంది. మన డైరెక్టర్ విఎన్‌ ఆదిత్యగారిని యుఎస్‌ తీసుకెళ్ళి ఏడాదిపాటు మేము జర్నీ చేశాం. ఎలా ..అన్నది అంటే కాంటాక్ట్ బిల్డ్ చేయాలన్నది ఐడియా. అది టీవికా, ఫిల్మ్‌కా అన్నది ఐడియా లేదు. ముందు పీపుల్‌ మీడియా అనేవాళ్ళం. తర్వాత క్రమంగా పీపుల్‌ మీడియా ఫ్టాక్టరీ అనడం మొదలుపెట్టాం.

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ మేకింగ్‌ వైపుకి అడుగులు వేసే అవకాశం ఉందా..?

నిశ్శబ్దం సినిమాతో మేమే చాలా సీరియస్‌గా ప్లాన్‌ చేశాం. అమెరికాలో సేగ్‌ అంటారు. అంటే స్టూడియో ఆర్టిస్ట్ గ్రూప్‌ అని ఉంటుంది. ఒక్క యూనియన్‌ ఆర్టిస్ట్‌ని తీసుకుంటే ఎలాటి ఛాలెంజ్‌లుంటాయిన్నది తెల్సుకోవడానికే 2018లో సీరియస్‌గా ప్రయత్నిస్తే 2019లో ప్రారంభించగలిగాం. మన తెలుగు సినిమాని ఎలా డిస్ట్రిబ్యూట్‌ చేయాలన్నదే తెలుసుకోవాలి. ఇప్పడు అయితే తెలుగు పిల్మ్ మార్కెట్‌కి ఉన్న విజిబులిటీ ప్రకారం ఆ ప్రాబ్లమ్‌ సాల్వ్ చేయడం పెద్ద ప్రాబ్లమ్‌ కాదిప్పుడు. We will release worldwide in a year or two.

అంటే ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తారా?

No, no…not experiment. We will surely execute.

రీసెంట్‌గా చిరంజీవిగారిని, బన్నీని కలిసారు కదా...వాళ్ళతో ఎప్పుడుంటాయి ఫిల్మ్స్..?

ప్రస్తుతానికైతే మామ్మూలుగా కలిపాం. ప్రొడక్షన్‌ ఉంది కాబట్టి ఆ ఆలోచన కూడా నేచురల్‌గా ఉంటుంది. కాకపోతే అన్నీ కుదరాలి కదా. వాళ్ళకి చాలా కమిట్‌మెంట్స్ ఉంటాయి కదా...మేం అయితే రేపైనా రెడీ(నవ్వుతూ)
చిరంజీవిగారితో చేయడానిక డైరెక్టర్ని ఎవర్నైనా అనుకున్నారా?
చాలా ఆప్షన్స్ ఉన్నాయి.... ఏది ఎలా జరుగుతుందో చూడాలి.
ఫెయిల్యూర్స్ మీద మీ ఎస్సెస్మెంట్‌ ఎలా ఉంటుంది?
మా బిజినెస్‌ పోస్ట్ మార్టమ్‌ ఉంటుంది. ఏది ఎందుకు ఎలా జరిగిందీ అని. అయితే అవి రిపీట్‌ కాకపోవచ్చు. అవచ్చు. చెప్పలేం. కానీ సీరియస్‌గా ఆలోచిస్తాం.

నిర్మాతగా మీ కెరీర్‌ అప్పుడే పదేళ్లు దాటుతోంది. మీ జర్నీ మీద మీ కామెంట్‌.?

పదేళ్ళంటే....సీరియస్‌గా అయితే ఐదేళ్ళు అయింది. సంతృప్తికరంగానే ఉంది. కోవిడ్‌ టైంలో ఒక సంవత్సరం ఆగింది. తర్వాత మళ్ళీ మొదలైంది.

డైరెక్టర్‌ అయి మైక్రోఫోన్‌ పట్టుకునే అవకాశం ఉందా?

(నవ్వుతూ) That is not my cup of tea.
అందరు పెద్ద స్టార్స్‌తో చేస్తున్నారు కదా. ఛాలెంజెస్ ఏమైనా ఫేస్‌ చేస్తున్నారా?
నేను పర్సనల్‌గా కలిసిన వారంతా కూడా నాతో చాలా హేపీగా ఉన్నారు. మాతో చెయ్యాలని కూడా అనుకుంటున్నారు. ఆటువంటి ఛాలెంజెస్‌ ఏవీ లేవు.

క్రియేటివ్‌ సైడ్‌ అస్సలు మీరు ఇన్వాల్వ్ అవరు కదా...

100 పర్సంట్‌ కాను. I do not get into get into the creative side how to make the film. I will look at how we are making the film”’ అని నవ్వుతూ మీడియా మీట్‌ని టీజి విశ్వప్రసాద్‌ ముగించారు.... చేసేదే చెప్పడం, చెప్పిందే చెయ్యడం అనేవే సక్సెస్‌ఫుల్‌ ఫీపుల్‌ ముఖ్య లక్షణం. ఆ లక్షణమే టీజిని సినిమా ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిని చేసింది. ఈ క్లారిటీ ఉన్నవాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. విజయం ఎప్పుడూ వెంటే ఉంటుంది. " Written By : నాగేంద్రకుమార్‌ "

Updated On 20 April 2023 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story