హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను(Payal Rajputh) నిర్మాతలు బండబూతులు తిడుతున్నారట! అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట! టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారట! ఈమె నటిస్తున్న కొత్త సినిమా రక్షణ(Rakshana). అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యిందో, ఎప్పుడు కంప్లీట్ అయ్యిందో ఎవరికి తెలియదు. అందుకు కారణం ఇది కొత్త సినిమా కాకపోవడమే.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను(Payal Rajputh) నిర్మాతలు బండబూతులు తిడుతున్నారట! అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట! టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారట! ఈమె నటిస్తున్న కొత్త సినిమా రక్షణ(Rakshana). అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యిందో, ఎప్పుడు కంప్లీట్ అయ్యిందో ఎవరికి తెలియదు. అందుకు కారణం ఇది కొత్త సినిమా కాకపోవడమే. నాలుగేళ్ల కిందట షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ కూడా వచ్చేసింది. అప్పట్లో ఈ సినిమాకు 5 డబ్ల్యూస్ అని పేరు పెట్టారు. సినిమా కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఎందుకో అది కూడా వర్క్ అవటవ్వలేదు. అందుకే ఆ సినిమా పేరు మార్చి రక్షణ అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాలన్నింటినీ పాయల్ రాజ్‌పుతే బయటపెట్టింది. దాంతో పాటు తనకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఏకరువు పెట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించి పాయల్‌కు పూర్తి రెమ్యునరేషన్‌ను(Remuneration) చెల్లించలేదట! ఇంకా కొంచెం అమౌంట్ పెండింగ్‌లో ఉందట! ఆ డబ్బు ఇవ్వకుండానే ప్రమోషన్లకు(Promotions) రమ్మని పాయల్‌ను బలవంతం చేస్తున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే డిజిటల్ ప్రమోషన్ చేస్తానని చెప్పినప్పటికీ నిర్మాతలు మాత్రం తప్పకుండా ప్రమోషన్లకు రావాల్సిందేనంటున్నారట! అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని పాయల్ రాజ్‌పుత్ వాపోతున్నది. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నది.