ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో(One day World Cup) టీమిండియా(Team India) పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అదరగొట్టే పర్ఫార్మెన్స్‌ను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన షమీ 16 వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో టాప్ ఫైవ్ బౌలర్ల(Top five bowler) చిట్టాలో చేరాడు. మొత్తం మీద షమీ పేరు ఇండియా అంతా మారుమోగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే షమీ పెళ్లి గురించి పెద్ద చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో(One day World Cup) టీమిండియా(Team India) పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అదరగొట్టే పర్ఫార్మెన్స్‌ను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన షమీ 16 వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో టాప్ ఫైవ్ బౌలర్ల(Top five bowler) చిట్టాలో చేరాడు. మొత్తం మీద షమీ పేరు ఇండియా అంతా మారుమోగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే షమీ పెళ్లి గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అతడు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అంటూ నటి పాయల్ ఘోష్(Payal Ghosh) రిక్వెస్ట్ చేసింది. పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు పరిచితమే! ఎన్టీఆర్(Jr.NTR) నటించిన ఊసరవెల్లి(Usaravelli) సినిమాలో తమన్నా(Tamannaah) ఫ్రెండ్ చిత్రగా నటించింది పాయల్ ఘోషే! లేటెస్ట్‌గా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి మహ్మద్ షమీకి పాయల్ ఘోష్ ప్రపోజ్ చేసింది. కాకపోతే పెళ్లికి ఓ కండీషన్ పెట్టింది. షమీ ఇంగ్లీష్‌ను మెరుగుపర్చుకుంటే అతడిని పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమేనని ట్వీట్(Tweet) చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది వైరల్ అవుతుండగానే పాయల్ ఘోష్ మరో ట్వీట్ చేసింది. అందులో ' మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పు' అని రిక్వెస్ట్ చేసింది. టీమిండియా ఫైనల్లో చేరాలని, అక్కడ నువ్వు హీరో అవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పింది. పాయల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తలో రీతిగా స్పందిస్తున్నారు. పాయిల్ నిజంగానే షమీకి ఫ్యాన్ అయిపోయిందా.? లేక పబ్లిసిటీ కోసమే ఇలా ట్వీట్ చేసిందా..? అని కొందరు అడుగుతున్నారు. 2014లో హసీన్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు షమీ. మరుసటి ఏడాది వారికో కూతురు పుట్టింది. 2018 నుంచి వారి దాంపత్యంలో కలతలు రావడం మొదలయ్యింది. షమీ తనను వేధిస్తున్నాడంటూ అతడిపై కేసు పెట్టింది. అప్పట్నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ కేసులో ఇటీవలే తీర్పు వచ్చింది. ప్రతి నెలా హసీన్‌కు లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని కోల్‌కతా కోర్టు తీర్పు చెప్పింది.