ప్రస్తుతం సినిమాలు కంప్లీట్ చేయడమే లక్ష్యంగా సాగుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan). ఎలక్షన్ కంటే ముందు ఎన్ని వీలైతే అన్నని సినమాలు కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా ప్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అందరు హీరోలకంటే బిజీ అయిపోయారు చేతిలో ఉన్న మూడు సినిమాలు షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చేయడమే లక్ష్యంగా డేట్స్ ఇచ్చేస్తున్నాడు.

Pawan Kalyan Green Signal To Sudheer Varma
ప్రస్తుతం సినిమాలు కంప్లీట్ చేయడమే లక్ష్యంగా సాగుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan). ఎలక్షన్ కంటే ముందు ఎన్ని వీలైతే అన్నని సినమాలు కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా ప్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అందరు హీరోలకంటే బిజీ అయిపోయారు చేతిలో ఉన్న మూడు సినిమాలు షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చేయడమే లక్ష్యంగా డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే వినోదయ సీతం రీమేక్ టాకీ పార్ట్ పూర్తి చేసిన పవర్ స్టార్.. ప్రస్తుతం హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈక్రమంలో సుజిత్ తో కమిట్ అయిన ఓజీ మూవీ ని రీసెంట్ గా ఓపెనింగ్ చేసిన పవర్.. మరో వారం రోజుల్లో ఈమూవీ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. అటు క్రిష్ తో హరిహరవీరమల్లు పెండింగ్ షూటింగ్ కూడా ఎదురు చూస్తుందతి. ఇక ఇఫ్పుడు ఈ సినిమాలు కాకుండా మరో దర్శకుడికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ.
ఇప్పటి వరకూ మేజర్ సినిమాలు ప్లాప్ దర్శకులకే అవకాశం ఇచ్చాడు పవర్. వరుసగా ప్లాప్ లు చూసిన క్రిష్ తో హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) చేస్తున్న పవన్ కళ్యాణ్.. సాహో(Saaho)తో ప్యాన్ ఇండియా ప్లాప్ అందుకున్న సుజిత్(Sujeeth) కు భారీ బడ్జెట్ చిత్రం అందించాడు. రీసెంట్ గా ఈసినిమాకు సబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశాడు సుజిత్. మరో వైపు మరో ప్లాప్ దర్శకుడు సుధీర్ వర్మ(Sudheer Varma)కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా రావణాసుర సినిమా(Ravanasura Movie)తో పెద్ద ప్లాప్ ను ఫేస్ చేశాడు సుధీర్ వర్మ. నిఖిల్(Nikhil)తో స్వామిరారా సినిమా(Swamy Ra Ra Movie) చేసి.. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుధీర్ వర్మ. ఈయనతో పవన్ కళ్యాణ్ సినిమా అంటూ... చాలా కాలంగా టాక్ నడుస్తూనే ఉంది. సుధీర్ కూడా ఏడాదిగా ట్రై చేస్తుంటే రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడట పవర్. మరి ముగ్గురు ప్లాప్ డైరెక్టర్లతో.. భారీ బడ్జెట్ సినిమాలు పవర్ కు ఎంత వరకూ కలిసి వస్తాయో చూడాలి.
అయితే సుధీర వర్మతో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. ఇది దాదాపు కన్ ఫార్మ్ అంటున్నారు సినీ జనాలు. ఈ సినిమాను సితార సంస్థ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నాడట. అయితే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందించనున్నట్టు సమాచారం.
