పవర్‌స్టార్‌ పవన్‌ పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan) చేయబోయే సినిమాలు ఇప్పుడు బాగా కాక పుట్టిస్తున్నాయి. ఓ పక్కన ఎఎంరత్నం(MM rathnam), క్రిష్‌(krish), పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ చిత్రం హరిహరవీరమల్లు(Hari Hari viramallu) శరవేగంతో పూర్తవుతోంది. మరో వైపున సముద్రఖని(samudhrakhani), పవర్‌ ప్లస్ లేటెస్ట్(first look) హిట్టర్ సాయి దర్మతేజ(Sai dharam tej) కాంబినేషన్లో సెట్స్ మీదనున్న తాజా చిత్రం ప్రస్తుతం విపరీతమైన సంచలనం రేపుతోంది.

దేవుడే దిగి వచ్చినా చిత్రం జూలై 28న విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.

పవర్‌స్టార్‌ పవన్‌ పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan) చేయబోయే సినిమాలు ఇప్పుడు బాగా కాక పుట్టిస్తున్నాయి. ఓ పక్కన ఎఎంరత్నం(MM rathnam), క్రిష్‌(krish), పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ చిత్రం హరిహరవీరమల్లు(Hari Hari viramallu) శరవేగంతో పూర్తవుతోంది. మరో వైపున సముద్రఖని(samuthrakani), పవర్‌ ప్లస్ లేటెస్ట్(first look) హిట్టర్ సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కాంబినేషన్లో సెట్స్ మీదనున్న తాజా చిత్రం ప్రస్తుతం విపరీతమైన సంచలనం రేపుతోంది.

ఎందుకంటే ఈ సినిమాకి టైటిల్‌ మీద ఈ మధ్యనంతా సోషల్‌ మీడియాలో ఎనలేని సందడి జరిగింది. దీనికి టైటిలే ఉందడని, టైటిల్‌ లేకుండానే విడుదలవుతుందని, విడుదలైన తర్వాత సినిమా చూసి వపర్‌స్టార్‌ అసంఖ్యాక అభిమానులు సూచించిన టైటిల్స్‌లో ఏది బావుందంటే దానినే ఖరారు చేస్తారని ఎవరికి వచ్చిన వార్త వాళ్ళు రాశారు. ఇది కూడా సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌న బాగా రెచ్చగొట్టింది. ఏంటీ పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి టైటిల్‌ లేదా అని అందరూ ఆశ్చర్యానికి గురి కావడమే కాదు, దీనికి సంబంధించి లక్షల్లో పోస్ట్‌లు వచ్చి పడ్డాయి. అదీ పవన్ కళ్యాణ్‌ క్రేజ్‌ అండ్‌ గ్లామర్‌.

అయితే వీటన్నిటికీ తెర దించుతూ మరో వార్త ఊపందుకుంది. ఇది మాత్రం నిజమైనదే కావడం ఇందులో చెప్పుకోదగ్గ విశేషం. తమిళ్‌లో ముందుగా సముద్రఖని దర్శకత్వంలో చేసిన వినోదయ సితం చిత్రం తెలుగులో పవన్‌ కళ్యాణ్‌, సాయిధర్మతేజ కాంబినేషన్‌లో రూపొందుతుంటే ఈ చిత్రకథని చాలా వరకూ సముద్రఖని తెలుగు నేటివిటీకి అనువుగా మార్చి షూటింగ్‌ మొదలు పెట్టారు. ముఖ్యంగా సాయిధర్శతేజ క్యారెక్టర్‌ రూపురేఖలు చాలా వరకూ మారిపోయాయి.
ఇప్పడు తెలుగు వెర్షన్‌లో.

గతంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన గోపాల గోపాల చిత్రంలో ఎలా అయితే పవన్‌ దేవుడు పాత్రను చేశాడో, ఇప్పుడీ వినోదయ సితం చిత్రంలో కూడా దానిని పోలిన పాత్రనే చేయడంతో ఈ సినిమాకి ‘’దేవుడే దిగి వచ్చినా’’ అనే టైటిల్‌ని ఫైనల్‌ చేసినట్టుగా ఫిల్మ్ యూనిట్‌ ద్వారా తెలుస్తోంది.

ఈ మాట వినగానే మనకి తక్షణమే గుర్తుకొచ్చేది నాగార్జున స్టారర్ సంతోషం చిత్రంలో పాట. సంతోషం కూడా సూపర్‌ హిట్‌ కావడం, దేవుడే దిగి వచ్చినా పాట చార్ట్‌ బస్టర్‌ కావడంతో ఈ టైటిల్‌ భలేగా సరిపోయిందని అందరూ అనుకుంటున్నట్టుగా తాజా ఖబర్‌.
పైగా, పవన్‌ కళ్యాణ్‌కి ఉన్న larger than life ఇమేజ్‌కి దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్‌ హండ్రెడ్‌ పర్సంట్‌ మేచ్‌ అవుతుందనేది అందరి కామెంట్. త్వరలోనే అఫీషియల్‌గా కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Updated On 4 May 2023 12:05 AM GMT
Ehatv

Ehatv

Next Story