పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటు సినిమాలు అంటు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో తమిళ సినిమా అయిన 'వినోదయ సీతం' (Vinodhaya Sitham) రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నారు పవర్ స్టార్ .

Pawan Kalyan
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటు సినిమాలు అంటు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో తమిళ సినిమా అయిన 'వినోదయ సీతం' (Vinodhaya Sitham) రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నారు పవర్ స్టార్ . అయితే ఈ సినిమాలకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చిత్రానికి 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్. ఇంతకముందు దేవర దేవుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే గతంలో వెంకటేష్ నటించిన 'గోపాల గోపాల' (Gopala Gopala) చిత్రంలో పవన్ కల్యాణ్ కృష్ణుడిగా కనిపించి అలరించారు. మళ్లీ ఇప్పుడు పవన్ దేవుడు క్యారెక్టర్స్‌లో కనిపించబోతుండటంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. టైటిల్ విషయంపై త్వరలోనూ ఓ అధికారిక ప్రకటన రానుందట. కొన్ని రోజులుగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)కు సంబంధించిన షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఓజీ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)కు సంబంధించి మే 11న ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.
