పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) షూటింగ్ కు సబంధించి అప్ డేట్ ఇచ్చారు టీమ్. ఈమూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ను కంప్లీట్ చేశారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) షూటింగ్ కు సబంధించి అప్ డేట్ ఇచ్చారు టీమ్. ఈమూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ను కంప్లీట్ చేశారు.

ఎట్టకేలకు పవర్ స్టార్ అభిమానులకు తియ్యటి వార్త వినిపించింది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈమూవీ మేజర్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించారు టీమ్. పవన్‌ కళ్యాణ్(Pawan kalyan) టెర్రిఫిక్‌ పర్ఫార్మెన్స్‌తో మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ‘IH’ అని ఉన్న క్యాప్‌ ఫోటోను పంచుకున్నారు.

అయితే ఈ సింబల్ ఎందుకు పెట్టారో అనేది ప్రకటించలేదు కాని.. ఫ్యాన్స్ మాత్రం ఐహెచ్ అంటే.. ఇండస్ట్రీ హిట్(Industry Hit) అని అంటున్నారు. పలువరు నెటిజన్లు మాత్రం ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పడానికి సింబాలిక్‌గా క్యాప్‌ ఫోటోను పెట్టారని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గబ్బర్‌సింగ్‌ తరహాలోనే అటు మాస్‌ను ఇటు క్లాస్‌ను ఆకట్టుకునే పోలిస్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి స్వరాలు అందిస్తున్నాడు.

అయితే వీరిద్దరి కాబోలో పదేళ్ల కిందట వచ్చిన గబ్బర్‌ సింగ్‌ మామూలు సక్సెస్ సాధించలేదు.. ఈసినిమా బాక్సాఫీస్‌ దగ్గర క్రియేట్ చేసిన రికార్డ్ లు అన్నీ ఇన్నీ కావు. అయితే నాలుగైదేళ్లుగా పవర్ స్టార్ నుంచి ఫుల్ మీల్స్ కోసం ఆకలితో ఎదరుచూస్తున్నారు ఫ్యాన్స్‌. వారికి కు ఈ సినిమా ఏకంగా ధమ్ బిర్యానీయే పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు పవర్ స్టార్ కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ డైరెక్టర్‌ అయితే.. తన అభిమాన హీరోను తెరపై ఎలా చూపిస్తాడో అనే దానికి ఒక ఎగ్‌జాంపుల్‌ క్రియేట్‌ చేశాడు దర్శకుడు. ఇక ఇప్పుడు అదే కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుందంటే పవన్‌ అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనే ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈసినిమా ప్రకటించినప్పుటి నుంచీ ఏదోఒక ఇబ్బది. పవర్ స్టార్ కంప్లీట్ గా షూటింగ్ కు వచ్చింది లేదు. అసలు ఈసినిమా ఉంటుందా.. ? కాన్సిల్ అవుతుందా అన్న అనుమానం కూడా కలిగిందిప్యాన్స్ కు. కొన్ని సోషల్‌ మీడియాలో ఆ ప్రాజెక్ట్‌ కాన్సిల్‌ అయిందని వార్తలు వచ్చాయి. కాగా గతేడాది చివరి నెలలో పేరు మార్చి మళ్లీ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి వీళ్ల కాంబో కాన్సిల్‌ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్‌కు వీలైనప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొంటూ తన సీన్స్‌ను కంప్లీట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు.

Updated On 1 Oct 2023 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story