పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయి యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అందరూ కనుకున్నట్టుగానే గ్లింప్స్‌లో పవన్ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు.

pawan kalyan ustaad bhagat singh
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయి యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అందరూ కనుకున్నట్టుగానే గ్లింప్స్‌లో పవన్ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. పవన్ మహంకాళి ఏరియా కాప్‌గా కనిపించనున్నారు, ఈ సారి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది అనే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఓల్డ్ సిటీలో జరిగే అక్రమాలు, అన్యాయాలకు చెక్ పెట్టే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయనున్నాడు పవన్. భగద్గీతలోని వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ ఇప్పటికే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఇక పోలీసు ఆఫీసర్‌గా పవర్ స్టార్ యాక్షన్ సీన్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఆ సినిమా గబ్బర్ సింగ్‌ను మించే ఉంటుందని ఇటు పవన్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ బలంగా చెప్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌కు పండుగ కాస్త ముందుగానే వచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఒచ్చేశాయి. గ్లింప్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నడుస్తోంది. టీజర్ రిలీజ్ అయి 24 గంటలు గడవకముందు కోటికి పైగా యూట్యూబ్ (Youtube) వ్యూస్‌ను దక్కించుకుంది. ఫస్ట్ గ్లింప్స్ ఒక్కటే ఈ రేంజ్లో ఉందంటే ఇంక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), అషుతోష్ రాణా మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం త్వరలోనే థియేర్లలోకి రాబోతుంది.
