ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం పవన్ హరీశ్ శంకర్(Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagath singh) షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్, హరీశ్‌శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా బాగా పెరిగాయి.
ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం పవన్ హరీశ్ శంకర్(Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagath singh) షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్, హరీశ్‌శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా బాగా పెరిగాయి. పవన్ తన మేనల్లుడు సాయిధరమ్(Sai Dharam Tej) తేజ్‌తో కలిసి నటించిన బ్రో(BRO) సినిమా ఈమధ్యే విడుదలయ్యింది. ఆ తర్వాత పవన్ సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ వపన్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 5వ తేదీన మొదలు పెట్టబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. ఆనంద్ సాయి వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ నటుడు అవినాష్ నటిస్తున్నారు.