బిజి బిజీ షెడ్యూల్స్ తో ఊపిరి మెసలకుండా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawankalyan) మొన్నటివరకూ సినిమాలు చేయడానికి కాస్త హోప్ ఉండేది. కాని ఆంధ్రాలో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అవ్వడంతో.. పవర్ స్టార్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వీలు కావడంలేదు. దాంతో ఆయన మూడుసినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. రెండు సినిమాలు మాత్రం అసలు చేస్తారా చెయ్యరా కూడా తెలియదు.

బిజి బిజీ షెడ్యూల్స్ తో ఊపిరి మెసలకుండా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawankalyan) మొన్నటివరకూ సినిమాలు చేయడానికి కాస్త హోప్ ఉండేది. కాని ఆంధ్రాలో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అవ్వడంతో.. పవర్ స్టార్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వీలు కావడంలేదు. దాంతో ఆయన మూడుసినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. రెండు సినిమాలు మాత్రం అసలు చేస్తారా చెయ్యరా కూడా తెలియదు. దాదాపు మూడేళ్ళకు పైగా అవుతుంది. ఆ సినిమాలు స్టార్ట్ అయ్యి.

అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు ఏమాత్రం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) తో కలిసి బ్రో(BRO) సినిమాలో నటించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడిచి..పర్లేదు అనిపించుకుంది. అయితే పవర్ స్టార్ రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. క్రిష్ తో హరిహర వీరమల్లు రెండు పెండ్డింగ్ లో ఉన్నాయి. ఇక ఆరెండు సినిమాలు వదిలేసి.. ఇప్పుడు పవన్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఓజీ(OG) అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ డిఫరెంట్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను అలరించింది . ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు. అలాగే కలకత్తా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.

పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు కొన్ని సినిమాలకు తన వాయిస్ కూడా ఇచ్చాడు. చిరంజీవి(Chiranjeevi) నటించిన సైరా నరసింహారెడ్డి(Syra Narsimha Reddy) సినిమాలో తన వాయిస్ వినిపించాడు. అలాగే తన సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు.జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు పాడారు పవన్. ఇక ఇప్పుడు ఇప్పుడు మరోసారి తన వాయిస్ వినిపించనున్నాడని తెలుస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వాయిస్ వినిపించనున్నారట. ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ తో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని తమన్ ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ పాటతో ఫ్యాన్స్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం అంటున్నారు అభిమానులు.

Updated On 20 Jan 2024 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story