పవర్‌స్టార్‌ పవన్‌(Pawan Kalyan) కల్యాణ్‌ సినిమా వస్తున్నదంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. ఇప్పుడు అభిమానులంతా ఒజీ(OG) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క ప్రీ లుక్‌ పోస్టర్తోనే(Pre-Look Poster) ఒజీ సినిమాకు ఎక్కడాలేని హైప్‌ వచ్చేసింది.

పవర్‌స్టార్‌ పవన్‌(Pawan Kalyan) కల్యాణ్‌ సినిమా వస్తున్నదంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. ఇప్పుడు అభిమానులంతా ఒజీ(OG) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క ప్రీ లుక్‌ పోస్టర్తోనే(Pre-Look Poster) ఒజీ సినిమాకు ఎక్కడాలేని హైప్‌ వచ్చేసింది. సుజీత్‌(Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్‌డేట్‌ వచ్చినా పది నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. అప్పుడెప్పుడో 12 ఏళ్ల కిందట పంజా అనే సినిమాలో పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆ పాత్రను పోషించడంతో సినిమాపై అభిమానులలో ఆసక్తి పెరిగింది. దీంతో పాటు ఈ సినిమాలో పవన్‌ మూడు విభిన్న వేరియేషన్స్‌లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం దర్శకుడు సుజీత్‌ ఓ పవర్‌ఫుల్‌ ఇంట్రోను ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఇలాంటి ఇంట్రో లేనే లేదట. ఇప్పటికే ఇంట్రో సీన్‌పై కసరత్తలు మొదలు పెట్టారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌మోహన్‌(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఖైదీ ఫేమ్‌ అర్జున్‌దాస్‌(arjun das) కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్యనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ 60 రోజుల కాల్షీట్లు ఇచ్చారట. ఈ ఏడాది చివరికల్లా టాకీ పార్ట్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటోంది.

Updated On 12 Jun 2023 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story