పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా.. పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతన్న సినిమా హరిహరవీరమల్లు.. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను విలక్షణ దర్శకుడు క్రిష్(Kris) రూపొందిస్తున్నాడు. ఫిక్షన్ స్టోరీతో తెరకెక్కుతున్నఈసినిమా షూటింగ్ ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. షూటింగ్ పార్ట్ చాలా మిగిలిపోవదంతోపాటు..

Hari Hara Veeramallu
హరి హరవీరమల్లు(Hari Hara Veeramallu) సినిమాపై ఎటువంటి అప్ డేట్ లేక ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. పవర్ స్టార్(Power Star) ఈసినిమాను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా.. పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతన్న సినిమా హరిహరవీరమల్లు.. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను విలక్షణ దర్శకుడు క్రిష్(Kris) రూపొందిస్తున్నాడు. ఫిక్షన్ స్టోరీతో తెరకెక్కుతున్నఈసినిమా షూటింగ్ ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. షూటింగ్ పార్ట్ చాలా మిగిలిపోవదంతోపాటు.. ఈసినిమా కోసం వేసి సెట్లు కూడా పాడైపోయాయి..ఎండకు ఎండి.. వర్షాలకు కూలిపోయాయి.. అయినా ఈసినిమా షూటింగ్ పై క్లారిటీ రాలేదు. అసలు ఈసినిమా ఉందా.. ఆగిపోుయిందా అని డౌట్ ఫ్యాన్స్ లో మొదలయ్యింది.
ఎందుకంటే.. ఈసినిమా తరువాత స్టార్ట్ చేసిన చాలా సినిమాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేశారు. కాని ఈసినిమా షూటింగ్ కు మాత్రం టైమ్ కేటాయించడంలేదు. దాంతో సినిమాను పవర్ స్టార్ వదిలేశారేమో్ అన్న అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియక అంతా కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. హరిహర వీరమల్లు రిలీజ్ సంగతి పక్కన పెడితే.. అసలు షూటింగ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
తనకు ఉన్న టైమ్ లో ఇతర సినిమాల షూటింగ్స్ కు ఎక్కువ టైమ్ కేటాయించిన పవర్ స్టార్... హరిహర వీరమల్లు వైపు మాత్రం అసలు చూడలేదు. దాంతో అందరికి రకరకాల అనుమానాలు బలపడుతున్నాయి. పుణ్యకాలం కాస్త అయిపోయి..పవర్ స్టార్ వారాహీ యాత్ర కోసం బయలుదేరాడు పవర్ స్టార్. ఈసినమా తరువాత స్టార్ట్ చేసిన బ్రో లాంటి సినిమాలు కంప్లీట్ అయ్యాయి కాని హరిహరవీరమల్లు మాత్రం అలాగే ఆగిపోయి ఉంది.
ఇక తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ త్వరలోనే ఈసినిమా కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారాహీ యాత్ర(Varahi Yatra) విషయంలో జోరు చూపిస్తున్నాడు పవర్ స్టార్. ఎలక్షన్స్(elections) విషయంలో ముందస్తు అనుమానాలు ఉండటంతో.. ఆయన సడెన్ గా జనాల్లోకి వెళ్ళిపోయారు. త్వరలో వీలు చూసుకుని హరిహర వీరమల్లును కంప్లీట్ చేస్తానన్నారట పవర్ స్టార్.
