నేడు టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు. జనసేన అధినేత, బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి రామ్ చరణ్ స్పెషల్ విషెస్ ను అందుకున్నారు. రామ్ చరణ్‌ను గ్లోబర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్‌లో ప్రశంసించారు.

Pawan Kalyan Special Birthday Wishes For Ram Charan
నేడు టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు. జనసేన అధినేత, బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి రామ్ చరణ్ స్పెషల్ విషెస్ ను అందుకున్నారు. రామ్ చరణ్‌ను గ్లోబర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్‌లో ప్రశంసించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ భాగమై గ్లోబల్ స్టార్ రేంజ్ కి చేరుకున్నాడని పవన్ కళ్యాణ్ అన్నారు.
"ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని.. సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్ధిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి... మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం RC16 పేరుతో బుచ్చి బాబు సనాతో కొత్త చిత్రం షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ తర్వాత రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా ఉండనుంది.
