అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు..క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్(Pawan Kalyan). అందులోనే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. పవర్ స్టార్ ఇంకా బిజీగా మారిపోయాడు. తాజాగా ఈహాడావిడికి దూరంగా..

Pawan kalyan To Italy
అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు..క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్(Pawan Kalyan). అందులోనే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. పవర్ స్టార్ ఇంకా బిజీగా మారిపోయాడు. తాజాగా ఈహాడావిడికి దూరంగా.. పవర్ స్టార్ కాస్త ప్రశాంతంగా గడపడానికి అవకాశం వచ్చింది. అదే మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగుతుండటంతో.. ఆ హడావిడిలో పాలు పంచుకోవడం కోసం పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టు తెలుస్తోంది.
అవును జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ, సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి(Italy) బయల్దేరారు. తన భార్యతో కలిసి ఆయన ఇటలీ ఫ్లైట్ ఎక్కారు. తన అన్నయ్య నాగబాబు(Nagababu) కుమారుడు, హీరో వరుణ్ తేజ్(Varun tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠీల(Lavanya tripathi) పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న మెగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి హాజరవడానికి పవన్ ఇటలీకి బయల్దేరారు.
నిజానికి ఈ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారా..? లేదా అనేది సందిగ్ధంలో ఉండేది. ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్... ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఏర్పడింది. కాని ఆ సందేహాలకు చెక్ పెడుతూ.. పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు, రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకోబోతున్నారు.
దాదాపు 5 ఏళ్ళకుపైగా ప్రేమించుకుంటున్నారు వరుణ్ లావణ్యలు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియనీయకుండా. సీక్రేట్ గా మెయింటేన్ చేశారు. గతంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్ లో లావణ్య పాల్గోనడంతో.. రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అవి ముదురుతూ వచ్చాయి. ఎన్ని కథనాలు ప్రసారం అయినా.. ఇద్దరు వీటిపై స్పందించలేదు. ఎవరి పని వారు చూసుకున్నారు. ఇక తాజాగా వీరి ప్రేమకు పెళ్ళి బంధంతో ముడి వేయబోతున్నారు.
