ఇక అసలు కథ విషయం చూస్తే.. మార్కండేయ అలియాస్ మార్క్ గా పిలవపడే హీరో క్యారెక్టర్ (సాయి ధరమ్ తేజ్) స్వార్థపరుడు. ఇతరులు ఏమైపోయినా పర్వలేదు కాని.. తన ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాడు. ఇతరుల ఇబ్బందుల గురించి ఆలోచించడు. చివరికి సొంత ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. అలా జివితం సాగుతున్న టైమ్ లో అనుకోకుండా ఊహించని పరిణామాలు జరిగి.. మార్క్ ఓ ప్రమాదంలో కన్నుమూస్తాడు. అప్పుడు గాడ్ ఆఫ్ టైం(పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇస్తారు. చనిపోయిన మార్క్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. గాడ్ ఆఫ్ టైం మార్క్ జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? మార్క్ మారాడా లేదా.. అనేది కథ.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) , సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నించిన మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో (BRO) . జులై 28న వరల్డ్ వైడ్ భారీగా విడుదలైన ఈమూవీ మెగా అభిమానులను అలరిస్తోంది. తమిళ దర్శకుడు, నటుడు సముద్ర ఖని తెరకెక్కించగా టీజీ విశ్వప్రసాద్ (TG ViswaPrasad) నిర్మించారీ సినిమాను. సోషియో ఫాంటసీ అంశాలతో ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. బ్రో చిత్ర ప్రీమియర్స్ ముగియగా టాక్ ఏంటో చూద్దాం

ఇక అసలు కథ విషయం చూస్తే.. మార్కండేయ అలియాస్ మార్క్ గా పిలవపడే హీరో క్యారెక్టర్ (సాయి ధరమ్ తేజ్) స్వార్థపరుడు. ఇతరులు ఏమైపోయినా పర్వలేదు కాని.. తన ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాడు. ఇతరుల ఇబ్బందుల గురించి ఆలోచించడు. చివరికి సొంత ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. అలా జివితం సాగుతున్న టైమ్ లో అనుకోకుండా ఊహించని పరిణామాలు జరిగి.. మార్క్ ఓ ప్రమాదంలో కన్నుమూస్తాడు. అప్పుడు గాడ్ ఆఫ్ టైం(పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇస్తారు. చనిపోయిన మార్క్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. గాడ్ ఆఫ్ టైం మార్క్ జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? మార్క్ మారాడా లేదా.. అనేది కథ.

ఇక సినిమా రివ్యూ చూసుకుంటూ.. ఈసినిమా పక్కాగా ఫ్యాన్స్ ను అలరించేు సినిమా .. ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ సినిమాకు హైలెట్ అని తెలుస్తోంది. మామా అల్లుడు కలిసి చేసిన సీన్స్ కొన్ని సినిమాకు హైలెట్ అవుతాయి. పవర్ స్టార్ డైలాగ్స్ తో పాటు ఆయన స్క్రీన్ లుక్ సూపర్ అని అంటున్నారు. ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా సినిమా ఆధ్యంతం అలరించిందనే చెప్పాలి. అంతే కాదు ఇద్దరు హీరోలు ఓ రేంజ్ లో ఎలివేషన్ సీన్స్ ఉండటంతో.. కామన్ ఆడియన్స్ కూడా కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నారట.

ఇక అందరూ ఊహించిన విధంగానే త్రివిక్రమ్ (Trivikram) డైలాగ్స్ పటాసుల్లా పేలాయి.. ముఖ్యంగా పవర్ స్టార్ కు లిప్ట్ ఇచ్చేలా.. పొలిటికల్ డైలాగ్స్ గట్టిగా రాశారు. మరీ ముఖ్యంగా గాజు గ్లాసు మీద రాసిన డైలాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని టాక్. ఎవరిని విమర్షించాలో వారినివిమర్షిస్తూ.. గట్టిగా ఏసుకున్నారట మూవీల్.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దా.. సాయి ధరమ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మనోడు ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేసి.. సక్సెస అయ్యాడట. పవర్ స్టార్ కు పోటీగా నటించిన శభాష్ అనిపించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈసినిమాలో వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. పవర్ స్టరా్ ఎంట్రీ వరకూ స్క్రీన్ పై దుమ్మురేపిన సాయి తేజ్.. ఆతరువాత కాస్త తగ్గక తప్పలేదు.అందుకే దర్శకుడు పవన్ కళ్యాణ్ పాత్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో కథ అంత బలంగా సాగదంటున్నారు.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చే వరకూ ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టించారు. ఫుల్ ఎమోషనల్ గా నడిపించాడు దర్శకుడు సముద్ర ఖని. బ్రో క్లైమాక్స్ విషయయంలో పడి పడీ ఏడ్చేలా చేశాడట. హీరో సాయి ధరమ్ తేజ్ కి నిజమైన లైఫ్ అంటే ఏమిటీ చెప్పే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయంటున్నారు. యూత్ కు ముఖ్యంగా మెగా ప్యాన్స్ కు గట్టిగా కనెక్ట్ అయ్యేలా.. త్రివిక్రమ్ డైలాగ్స్.. ఏడిపించేశాయట.

ఈసినిమాలో మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే .. హీరోయిన్స్ క్యారెక్టర్లు ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే.. వాటికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. పెద్దగా డైలాగ్స్ లేవు.. స్క్రీన్ స్పేస్ లేదు.. ఈమూవీలో హీకరోయిన్లు గా నటించిన కేతిక శర్మ, ప్రియా వారియర్స్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సినిమా సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ మీద సాగుతుంది. మధ్యలో మాత్రం ఊర్వశీ రౌతేలా వచ్చి.. మెరుపులు మెరిపించి వెళ్తుంది అంతే.

పవన్ కళ్యాణ్ మేనరిజం, టైమింగ్ డైలాగ్స్, డాన్సులు ఫీస్ట్ సినిమాకు ప్లస్.. బలమైన స్టోరీ లేకపోవడం మైనస్.. కాని ఆ మైనస్ ను పవన్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ లాగించేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో కాస్త కవర్ చేశారు. అయితే బలహీనమైన కథ, కథనాలు, ఓవర్ సినిమాటిక్ సీన్స్ నిరాశపరుస్తాయి.

ఇక మెత్తంగా బ్రోస్.. మన బ్రో సినిమా గురించి చెప్పాలి అంటే.. ఈసినిమా మెగా ప్యాన్స్ కు.. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుంది. కామన్ ఆడయిన్స్ ను అలరిస్తుంది. క్రిటిక్స్ అయితే మాత్రం యావరేజ్ అనేస్తారేమో.. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం అలా అని డిజాస్టర్ కాదు.. ప్లాప్ కూడా కాదు.. యావరేజ్ అంటానికి కూడా లేదు.. మొత్తంగా హిట్టు సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. మరి సినిమా రిలీజ్ అయ్యి.. రన్నింగ్ లో ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉంటా చూడాలి. నిర్మించారు.

Updated On 28 July 2023 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story