ఇంద్రకీలాద్రిపై(Indra kiladhri) కొలువైన కనక దుర్గమ్మ గుడి మెట్లను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) శుభ్రం చేశారు.
ఇంద్రకీలాద్రిపై(Indra kiladhri) కొలువైన కనక దుర్గమ్మ గుడి మెట్లను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) శుభ్రం చేశారు. పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టారు. తర్వాత మీడియాతో సనాతన ధర్మం గురించి అనర్గళంగా మాట్లాడారు. ఇందులో ఆయన వైసీపీ నేతలపై(YCP Leaders) పెద్ద పెట్టున విమర్శలు గుప్పించారు. గొడవ పెట్టుకోవాలి అంటే ఎంత గొడవకి అయినా తాను సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే 'సెక్యులరిజం(Secularism) అనేది ఒకే సైడ్ ఉంటే కుదరదు.. అన్ని సైడ్ ల నుండి రావాలి. హిందువులే తోటి హిందువులను తిడుతున్నారు. మసీదు, చర్చిలో ఇలానే జరిగితే వైసీపీ(YCP) నాయకులు ఇలాగే మాట్లాడతారా..?' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మంకోసం తాను చనిపోడానికి అయినా సిద్ధమన్నారు. వైసీపీలో హిందువులు మౌనం వీడండి అంటూ హితవు చెప్పారు. దేవుడితో ఆటలు వద్దని, తరాలు నాశనం అయిపోతాయని అన్నారు. సినిమా హీరోలకు, వారిని అభిమానించే వారికి కూడా పవన్ ఓ సూచన చేశారు. 'మా సినిమా అభిమానులు సనాతన ధర్మాన్ని పాటించండి. అందరి సినిమా హీరోలు ధర్మం కోసం మాట్లాడండి. హిందువులు అంటే మెత్తని మనుషులు అందుకే హేళన చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారు ఈ ఇష్యూ గురించి మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేకుంటే నోరు మూసుకుని కూర్చోండి' అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.