పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్(Krish) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్(Krish) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించాల్సి ఉంది. మరి వాటి అప్ డేట్ ఏంటంటే..?

భారీ బడ్జెట్.. కోట్లతో సెట్టింగ్ లు.. పీరియాడిక్ కాన్సెప్ట్.. హరిహరవీరమల్లు(Hari hara vira mallu) ఇంత పెద్ద బరువు ఎత్తుకుని ఉన్నాడు డైరెక్టర్ క్రిష్. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించాల్సి ఉంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఈమూవీ షూటింగ్ కు మంచి రోజులు వచ్చినట్టు తెలుస్తోంది. తన పెండింగ్ సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని రంగంలోకి దిగాడు పవర్ స్టార్. దాంట్లో భాగంగా.. హరిహరవీరమల్లు కు కూడా డేట్స్ ఇచ్చేశాడట. దాంతో కాగా తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేటన్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.

టీమ్ సమాచారం ప్రకారం... ఈ నెల 13వ తేదీ నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ సారధి స్టూడియోలో స్టార్ట్ కానుంది. పవన్ కళ్యాణ్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నట్ట తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాక్షన్ ఎపిసోడ్ తాలూకు సెటప్ ను మొత్తం రెడీ చేశారు. దాదాపు 2 కోట్ల పెట్టి ఈసెట్ వేసినట్టు సమాచారం. అయితే గతంలో వేసిన సెట్ట పాడైపోవడంతో.. మళ్ళీ సెట్ వేసినట్టు.. టాక్ నడుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. షూటింగ్ డిలై అవ్వడం వల్ల బడ్జెట్ భారీగా పెరిగి.. చాలా వరకూ నష్టం వచ్చిందనిసమాచారం.

అయితే ఈమూవీ హిట్అయ్యి భారీగా కలెక్షన్లు వస్తే కాని.. హరిహరవీరమల్లు ను నమ్ముకున్నవారు గట్టెక్కరు. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నిథి అగర్వాల్ పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On 12 April 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story