పవర్ ప్టార్ పవర్ కల్యాణ్ (Pawan Kalyan) - డైరెక్టర్ (Sujeeth) సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG (Original Gangster). ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ (RRR) వంటి భారీ చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచే మాంచి బజ్ క్రియేట్ అయింది. మొదటి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

పవర్ ప్టార్ పవర్ కల్యాణ్ (Pawan Kalyan) - డైరెక్టర్ (Sujeeth) సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG (Original Gangster). ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ (RRR) వంటి భారీ చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచే మాంచి బజ్ క్రియేట్ అయింది. మొదటి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా షూట్ మొదలవ్వక ముందు నుంచే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా పేరుతో అంటే OGతో టీ షర్ట్స్ కూడా వచ్చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. The #OG has Arrived On sets అంటూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సెట్స్‏కి రావడాన్ని డీవీవీ ఎంటర్ టైన్‏మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ ఎంటర్ అయిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

OG చిత్ర షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. డైరెక్టర్ సుజీత్ (Sujeeth) ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‏గా ప్రియాంక అరుల్ మోహన్‏ (Priyanka Mohan)ను పిక్ చేసుకుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మొన్నటి వరకు సముద్రఖని (Samuthirakani) సినిమా షూట్ కంప్లీట్ చేసుకుని.. ఆ తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)లో కొన్ని రోజులు షూటి చేసి.. ఇప్పుడు తాజాగా కొన్ని డేట్స్‏ను OG చిత్రానికి కేటాయించాడు. ఇటు సైన్ చేసిన సినిమాలకు బ్యాలెన్స్డ్‏గా డేట్స్‏ను కేటాయిస్తున్నారు ఆయన. మరోవైపు రాజకీయాలకూ టైమ్ కేటాయిస్తూనే సినిమాలు షూట్స్ కంప్లీట్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఇక OG (Original Gangster) చిత్రం తొందరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.

Updated On 18 April 2023 3:19 AM GMT
Ehatv

Ehatv

Next Story