సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఆ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికలు(Assemby Elections) కూడా జరుగుతాయి. తెలంగాణలో అంతకు ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పార్టీలన్నీ సమరానికి సమయాత్తమవుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఆ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికలు(Assemby Elections) కూడా జరుగుతాయి. తెలంగాణలో అంతకు ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పార్టీలన్నీ సమరానికి సమయాత్తమవుతున్నాయి. అధికారపక్షం మీద విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాడి పెరిగింది. అలాగే విపక్షాలపై అధికారపక్షం విసురుతున్న విసుర్లలో వేడి పెరిగింది.

ఎవరికివారు తమకు అందుబాటులో ఉన్న మాధ్యమాలతో పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అవతలివారిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సినిమా అన్నది అత్యంత శక్తివంతమైన మీడియం! సినిమాలు ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. ఈ విషయం తెలుసు కాబట్టే బీజేపీ(BJP) కొన్ని సినిమాలను ప్రమోట్‌ చేస్తున్నది. కశ్మీర్‌ ఫైల్స్‌(Kashmir Files), ది కేరళ స్టోరీ(The Kerala story), అజ్మీర్‌ 92(Ajmir 92) సినిమాలు ఇలాంటివే! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల వేళ రాజకీయాంశలతో కూడిన కొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఎలాగో హీరో కాబట్టి, ఆయన సినిమాలను జనం ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ఈయన సినిమాల్లోనే పొలిటికల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను(Ustad bagath singh) తన పొలిటికల్‌ కెరీర్‌కు సోపానంగా ఉండేట్టు చూసుకుంటున్నారు పవన్‌.. హరీష్‌ శంకర్‌(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ డైలాగులు ఉంటాయట. అవన్నీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan Reddy) వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందట.

ఇందుకోసం దర్శకుడు హరీశ్‌ శంకర్‌, మాటల రచయిత కలిసి కసరత్తులు చేస్తున్నారట. జగన్‌ ప్రభుత్వ విధానాలపై పవర్‌ఫుల్‌ సెటైర్లు ఉంటాయట. జగన్ సర్కారు తీరు తెన్నులపై సునిశితమైన విమర్శలు కూడా ఉంటాయని టాక్! ఓ రకంగా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా జనసేనకు అనుకూలంగా, జగన్‌ పార్టీకి ప్రతికూలంగా ఉండబోతున్నది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSR Congress) ఎన్నికల సింబల్ ఫ్యాన్‌ పైన కూడా కొన్ని చురకలు ఉంటాయట! మరి ఈ సినిమా జనసేనకు ఏ మేరకు మేలు చేకూరుస్తుందో, జగన్‌ పార్టీకి ఎలాంటి కీడు తలపెడుతుందో చూడాలి.

Updated On 15 Jun 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story