పవర్ స్టార్(Power Star) మంచి జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలతో తెగ హడావిడి చేస్తున్నాడు. ఈ రెండు నెలలు సినిమాలు కంప్లీట్ చేయడానికి కేటాయించాడు. ఆతరువాత పాలిటిక్స్ పై దృష్టి పెట్టబోతున్నాడు.

పవర్ స్టార్(Power Star) మంచి జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలతో తెగ హడావిడి చేస్తున్నాడు. ఈ రెండు నెలలు సినిమాలు కంప్లీట్ చేయడానికి కేటాయించాడు. ఆతరువాత పాలిటిక్స్ పై దృష్టి పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్((ustad baghath singh)) తో పాటు.. సుజిత్(Sujeeth) తో ఓజీ(OG) మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి..సెట్ లో సందడి చేశాడు. ఇక దీనితో పాటు హరీహరవీరమల్లు సినిమాపెండింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ఈసినిమా కోసం మరోసారి గాత్రం సవరించబోతున్నాడట.

పవన్ కల్యాణ్ హీరో(pawan kalyan), నిథి అగర్వాల్Needhi agarwal) హీరోయిన్ గా నటిస్తున్న హరి హర వీరమల్లు(Hari Hara viramallu) సినిమా చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. సెట్స్ ఎక్కించి చాలా రోజులు అవుతున్నా... అప్పటి నుంచి సెట్స్ పైనే ఉంది. ఈసినిమా కోసం వేసిన భారీ సెట్లు కూడా వృదా అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక తన సినిమాల బ్యాలన్స్ షూటింగ్ ప్రక్షాళన కార్యక్రమం పెట్టుకున్నాడు పవన్. క్రిష్(Krish) దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం(MM ratnam) నిర్మిస్తున్న ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల .. లేట్ అవుతూ వస్తోంది. ఇక ఈసారి ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని కంకణం కట్టుకున్నాడు పవర్ స్టార్.

ఇక పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆ దిశగానే ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది. ఇక ఈమూవీలో మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో ఒక పాట పాడించే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ క్రిష్ . ఆ పాటను పవన్ పాడితేనే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించాడని అంటున్నారు. పవన్ కి తగినట్టుగా కీరవాణి ట్యూన్ చేశారని చెబుతున్నారు. సినిమాలో ఒక కీలకమైన సిచ్చ్యూవేషన్ లో .. ఈ పాట వస్తుందని అంటున్నారు. ఈ పాటను రికార్డు చేయడానికి కూడా అంతా రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం.

గతంలో కూడా చాలా సినిమాల్లో పవర్ స్టార్ సూపర్ హిట్ పాటలు పాడారు. కెరీర్ స్టార్టింగ్ లో పవన్ 'తమ్ముడు'(Thamudu) సినిమాతో పాడటం స్టార్ట్ చేశాడు.. ఆతరువాత గుడుంబా శంకర్. జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలలో పాటలు పాడారు. ఆసినిమాలకు ఆయన పాడిన పాటలే ఆకర్షణగా మారాయి. దాంతో హరిహర వీరమల్లు' సినిమాలోని పవన్ పాట కూడా ఒక రేంజ్ లో పాపులర్ అవుతుందని భావిస్తున్నారు.

Updated On 25 April 2023 11:46 PM GMT
Ehatv

Ehatv

Next Story