పాలిటిక్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన సినిమాలపై దృష్టి పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాధ్యమైనంత వరకూ సినిమాలు ఏప్రిల్ లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దసరా రిలీజ్ వైపుగా అడుగులు వేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా. ఈ మూవీ షూటింగు మొదలై చాలా కాలమైంది.

పాలిటిక్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన సినిమాలపై దృష్టి పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాధ్యమైనంత వరకూ సినిమాలు ఏప్రిల్ లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

దసరా రిలీజ్ వైపుగా అడుగులు వేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా. ఈ మూవీ షూటింగు మొదలై చాలా కాలమైంది. అయితే కోవిడ్ లాంటి కొన్ని కారణాల వల్ల షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగలేదు. ఈలోపు పవర్ స్టార్ పొలిటికల్ గా బాగాయాక్టీవ్ అవ్వడంతో సినిమా ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్నట్టుగా తయారయ్యింది. ఆ ఎఫెక్ట్ తో ఆశించినంత వేగంగా ఈ సినిమా షూటింగు జరగలేదు. భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈసినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసి రూపోందించిన సెట్స్ లో షూటింగ్స్ జరుపుతూ వస్తున్నారు. అయితే అభిమానుకలు షాక్ ఇస్తూ.. ఈసినిమాను అలా పక్కకుపెట్టి.. పవర్ స్టార పవన్ కళ్యాణ్ సముద్రఖని డైరెక్షన్ లో కొత్త సినిమా ఒప్పుకుని.. రీసెంట్ గా దాన్ని ప్లీట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయసీతం సినిమా టాకీ పార్ట్ ను కంప్లీట్ చేశారు. దాంతో వీరమల్లు పరిస్థితి ఏంటీ అని ఫ్యాన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ముందు స్టార్ట్ చేసినవి వదిలేసి... రీసెంట్ గా ఒప్పుకున్నవి కంప్లీట్ చేయడంతో..అంతా ఆశ్చర్యపోయారు.

వీరమల్ల సినిమా అంతా యుద్దాలు.. కత్తులు.. కర్రసాములు.. ఇలా కాస్త వర్క్ ఎక్కువగా ఉండే ఫిక్షన్ కథ, దాంతో ఈసినిమాకు టైమ్ కాస్త ఎక్కువగా పడుతుంది. పవర్ డేట్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. అందులోను.. అప్పుడు కొంత ..ఇప్పుడు కొంత అంటూ.. 65 శాతం సినిమా కంప్లీట్ చేశాడు క్రిష్. ఇక మిగిలినదికూడా త్వరగా కప్లీట్ చేయాలని చూస్తున్నాడు. అటు పవన్ కూడా ఈసారి హరిహరవీరమల్లు సినిమాకోసం ఎక్కువగా డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ ఏప్రిల్ అంతా తన టైమ్ ను సినిమాలకు కేటాయించాలని నిర్ణయించాడట పవర్ స్టార్.

అసలు అన్నీ కుదిరితే.. హరిహరవీరమల్లు సినిమాను ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని అది కుదరలేదు. దాంతో ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.ఇక పవన్ ఈసినిమాతో పాటు నాలుగేళ్ళకిందట అనుకున్ని.. హరీష్ శంకర్ కు కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కు కూడా ఏప్రిల్ లో 10 రోజులు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అటు సుజిత్ తో కమిట్ అయిన సినిమా కూడా ఈ నెలలోనే ఓపెనింగ్ జరుపుకోబోతున్నట్టుసమాచారం.

Updated On 29 March 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story