రాజకీయాలపై అవగాహన ఉన్నవారు అలిపిరి ఘటనను మర్చిపోరు. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) సంబంధించినంత వరకు అది ముఖ్య సంఘటన.. 2003, అక్టోబర్‌ 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లక్ష్యంగా నక్సలైట్లు(Naxalites ) కైమోర్‌ మైన్స్‌(Kaimore Mines) పేల్చారు. చంద్రబాబు తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ నాటి ఘటనను మరోసారి గుర్తుకు తెచ్చుకోండి.. అప్పుడు ముఖ్యమంత్రి కారుపైకి ఎక్కి చంద్రబాబును పైకిలాగుతున్న పోలీసును స్ఫురణకు తెచ్చుకోండి.. గుర్తొచ్చిందా..?

రాజకీయాలపై అవగాహన ఉన్నవారు అలిపిరి ఘటనను మర్చిపోరు. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) సంబంధించినంత వరకు అది ముఖ్య సంఘటన.. 2003, అక్టోబర్‌ 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లక్ష్యంగా నక్సలైట్లు(Naxalites ) కైమోర్‌ మైన్స్‌(Kaimore Mines) పేల్చారు. చంద్రబాబు తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ నాటి ఘటనను మరోసారి గుర్తుకు తెచ్చుకోండి.. అప్పుడు ముఖ్యమంత్రి కారుపైకి ఎక్కి చంద్రబాబును పైకిలాగుతున్న పోలీసును స్ఫురణకు తెచ్చుకోండి.. గుర్తొచ్చిందా..?

అప్పుడు సూపర్‌కాప్‌గా పేరు తెచ్చుకున్న ఆ పోలీసు అధికారినే ఇప్పుడు వివాదాల సుడి గుండంలో చిక్కిన అంజూ యాదవ్‌(Anju Yadav). వరుస వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ఎస్‌ఐగా(Sri Kalahasti SI) పని చేస్తున్న ఆమెపై జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) పీకల్దాక కోపం పెట్టుకున్నారు. ఆమె వ్యవహారంపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.

అందుకోసం ఇప్పటికే ఆయన తిరుపతి(Tirupathi) చేరుకున్నారు. పవన్‌కు అంత కోపం ఎందుకొచ్చిందంటే జనసేన నేత సాయిపై(Sai) ఆమె దాడి చేసినందుకు! ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి పవన్‌ అభిమానులు తిరుపతి చేరుకున్నారు. ఇప్పటి వరకు అంజూ యాదవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జనసేన కార్యకర్తలలో ఆగ్రహం తెప్పిస్తోంది. ఆమె వ్యవహారంపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి(SP Parameshwar Reddy) డీజీపీ(DGP) కార్యాలయానికి ఓ నివేదిక పంపారు. చూద్దాం ఏం జరుగుతుందో.. అదలా ఉంచితే అంజూ యాదవ్‌ మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. అందుకు కారణం ఆమె తీరే! గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఏర్పేడు మండలంలో అధికారులు వైసీపీ నేతల ఒత్తిడితోనే తమ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని టీడీపీ ఆరోపించింది. ఆ సమయంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బొజ్జల సుధీర్‌ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

బందోబస్తు నిమిత్తం రేణిగుంట నుంచి వచ్చిన అంజూ యాదవ్‌ టీడీపీ(TDP) నేతలపట్ల దురుసగా వ్యవహరించారట! అప్పుడు టీడీపీ శ్రేణులు ఆందోళన కూడా చేశాయి. అలాగే శ్రీకాళహస్తిలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన ప్రదర్శించేందుకు వెళ్లిన సందర్భంలోనూ, అనాసంపల్లిలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంలోనూ టీడీపీ నాయకులపై అంజూ యాదవ్‌ దురుసుగా వ్యవహరించారట! శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి జగన్‌ దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ ఉన్న టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత కోబాకు లక్ష్మణ్‌పై అంజూ యాదవ్‌ చేయిచేసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలో నిరసన తెలిపేందుకు వెళ్లిన తెలుగు మహిళా నాయకురాలు చక్రాల ఉషపై కూడా దురుసుతనం ప్రదర్శించారు. లేటెస్ట్‌గా జనసేన నేత కొట్టె సాయిపై అందరి ముందు చేయి చేసుకున్నారు.

ఇంకా చాలా ఇన్సిండెంట్లలో అంజూ యాదవ్‌ వివాదాలను కొని తెచ్చుకున్నారు. అప్పట్లో డిమాండ్ల సాధనకై ఉపాధ్యాయ సంఘాలు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం రేణిగుంట నుంచి వెళుతున్న ఉపాధ్యాయులపై అంజూ యాదవ్‌ దురుసుగా వ్యవహరించారు. చివరికి విలేకరులను కూడా ఆమె వదల్లేదట. రేణిగుంటలో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోయారు. రమేశ్‌ అనే విలేకరి దీనిపై డీఎస్పీని వివరణ కోరారు. ఈ విషయం తెలుసుకున్న అంజూ యాదవ్‌.. రమేశ్‌కు ఫోన్‌ చేసి నానా మాటలన్నారట. మరుసటి రోజు వార్త వచ్చేసరికి అతడితో పాటు, కుటుంబసభ్యులను స్టేషన్‌కు తీసుకెళ్లి తిట్టి కొట్టి పంపారట. దీనిపై దళిత సంఘాలు కలెక్టర్‌, ఎస్పీతో పాటు గవర్నర్‌ కూడా ఫిర్యాదు చేశాయి. రేణిగుంటలో ఓ వ్యక్తి భవన నిర్మాణం కోసం సామాగ్రిని తెప్పించుకుని రోడ్డుపై పెట్టారట! దీనిపై పోలీసులకు కంప్లయింట్‌ వచ్చింది. దీంతో అంజూ యాదవ్‌ ఆ భవన యజమానిని స్టేషన్‌కు పిలిపించి చేయి చేసుకున్నారట! దీనిపై ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి ప్రశ్నించడానికి వెళితే, ఆయనతో కూడా అలాగే వ్యవహరించారట! దీంతో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురు పవిత్రారెడ్డి పట్ల కూడా సీఐ దురుసుగా వ్యవహరించారట! ఒకటా రెండా... అంజూ యాదవ్‌పై బోల్డన్నీ కంప్లయింట్లు ఉన్నాయి.

Updated On 17 July 2023 1:14 AM GMT
Ehatv

Ehatv

Next Story