రాజకీయాలు బంధుత్వాలను దూరం చేస్తాయి. నందమూరి ఫ్యామిలీలో(Nandhamuri Family) ఇదేకదా జరిగింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో(mega family) కూడా అదే జరిగింది. మెగా కుటుంబం అంటే చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్‌కల్యాణ్‌(Pawan kalyan). ఈ అన్నదమ్ములతో అల్లు ఫ్యామిలీ ఎంతో సఖ్యతో ఉండింది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పవన్‌తో జల్సా(Jalsa), రామ్‌చరణ్‌తో(Ram Charan) మగధీర తీశారు అల్లు అరవింద్‌(Allu Arvind). ఇప్పుడు ఆయన కుమారుడు అల్లు అర్జున్‌ కొణిదెల కుటుంబానికి దూరమయ్యారనే అనిపిస్తోంది.

రాజకీయాలు బంధుత్వాలను దూరం చేస్తాయి. నందమూరి ఫ్యామిలీలో(Nandhamuri Family) ఇదేకదా జరిగింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో(mega family) కూడా అదే జరిగింది. మెగా కుటుంబం అంటే చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్‌కల్యాణ్‌(Pawan kalyan). ఈ అన్నదమ్ములతో అల్లు ఫ్యామిలీ ఎంతో సఖ్యతో ఉండింది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పవన్‌తో జల్సా(Jalsa), రామ్‌చరణ్‌తో(Ram Charan) మగధీర తీశారు అల్లు అరవింద్‌(Allu Arvind). ఇప్పుడు ఆయన కుమారుడు అల్లు అర్జున్‌ కొణిదెల కుటుంబానికి దూరమయ్యారనే అనిపిస్తోంది. ముగ్గరు అన్నదమ్ములు అల్లు అర్జున్‌ మీద అసహనం, ఆగ్రహంతో ఉన్నారట! పవన్‌ కోసం పిఠాపురానికి వెళ్లకుండా తన స్నేహితుడు, అది కూడా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌(YCP) అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం వీళ్లకు జీర్ణం కావడం లేదు. తన కోపాన్ని నాగబాబు ట్వీట్‌ ద్వారా ప్రదర్శించారు కూడా! నాగబాబు తన సన్నిహితుల దగ్గర అల్లు అర్జున్‌ను బండబూతులు తిడుతున్నాడని చెబుతున్నారు. చిరంజీవి మాత్రం తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ మిన్నకుండిపోయారు. పవన్‌ కూడా బయటపడటం లేదు కానీ కోపంతోనే ఉన్నారు. అయితే అల్లు అర్జున్‌ మాత్రం కొణిదెల కుటుంబంతో బంధాలు తెంచుకోవానికి సిద్ధంగా లేరు.

2019లో జనసేన పార్టీకి అందరికంటే ముందు అల్లు అర్జునే రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. నాగబాబు ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు నా పేరు సూర్య సినిమాకు ప్రెజెంటర్‌గా పేరు వేయించి కొంత సాయం అందేలా చేశారు. ఇంత చేసిన బన్నీ ఇప్పుడు తన ఫ్రెండ్‌ కోసం ప్రచారానికి వెళితే కొంపలంటుకున్నట్టు మెగా ఫ్యామిలీ ప్రవర్తిస్తోంది. అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడు బన్నీ వాసు గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కోసం చాలా కష్టపడ్డారు. ఎంతో శ్రమించాడు. అయినా పవన్‌ ఎందుకో వాసును దూరం పెట్టాడు. మళ్లీ ఏమైందో ఏమో కానీ పవనే పిలిచి అతడికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాడు. అల్లు అర్జున్‌కు ఇష్టం లేకపోతే బన్నీ వాసు ఇలా చేయడు కదా! నిజానికి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి ప్రచారం చేయడం కోసం బన్నీ నంద్యాల వెళ్లడం ఇంత కాంట్రవర్సరీ అవుతుందని అల్లు అర్జున్‌ అనుకోలేదు. అల్లు అర్జున్‌ ప్రచారానికి వెళ్లడంతో నంద్యాలలో వైసీపీ మైలేజ్‌ పెరిగిన మాట వాస్తవం. మెగా ఫ్యామిలీ ఇంతలా రియాక్టవుతుందని బన్నీ ఊహించలేదు. లేకుంటే వెళ్లేవారే కాదు. మొత్తం మీద మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్‌పై రుసరుసలాడుతున్నారు. అయితే ఈ కోపతాపాలు తాత్కాలికమేనని కొందరు అంటున్నారు.

Updated On 16 May 2024 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story