టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), నుపుర్ సనన్(Nupur Sanon), గాయత్రి భరద్వాజ్(Gayathri Bharadwaj) కాంబినేషనర్ లో తెరకెక్కుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao). పేరుమోసిన స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ మూవీపై ఎన్నో వివాదాలు ఉండగా..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), నుపుర్ సనన్(Nupur Sanon), గాయత్రి భరద్వాజ్(Gayathri Bharadwaj) కాంబినేషనర్ లో తెరకెక్కుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao). పేరుమోసిన స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ మూవీపై ఎన్నో వివాదాలు ఉండగా.. అన్నింటిని దాటుకుని రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు. ఈక్రమంలో ఈసినిమా నుంచి వరుసగా అప్ డేట్లు రెడీ చేస్తున్నారు టీమ్.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(Abhishek Aggarwal Arts) బ్యానర్ పై వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో.. పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈసినిమాలో నటి రేణూ దేశాయ్ ఓ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం(Hemalatha Lavanam) పాత్రలో ఆమె నటిస్తున్నారు. రేణూ దేశాయ్ పాత్రకు సంబంధించిన లుక్ ను మూవీ టీమ్ పంచుకుంది.

కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ దగ్గరలో ఉండటంతో.. మూవీకి సబంధించిన ప్రమోషన్స్ కు పదును పెట్టబోతున్నారు. ఇక ఈమూవీ నుంచి ట్రైలర్ ను అక్టోబరు 3న విడుదల చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దసరా సీజన్ లో అక్టోబరు 20న టైగర్ నాగేశ్వరరావు సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.

కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. అంతేకాదు, రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Updated On 2 Oct 2023 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story