’ఆహా‘ ఓటీటీలో నందమూరి బాలక్రిష్ణ హోస్ట్ గా టాక్ షో అన్ స్టాపబుల్ రన్ అవుతోంది. అయితే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చేసిన ఎపిసోడ్ పార్ట్-1లో కాస్త సినిమాలు, పర్సనల్ ఇష్యూస్ ని టచ్ చేసినప్పటికీ.. ఇప్పుడీ సెకండ్ పార్ట్ లో పూర్తిగా రాజకీయంగానే షో నడిచింది. షోలో బాలయ్య అడిగిన కొన్ని ప్రశ్నలకు పవన్ స్ట్రయిట్ గానే సమాధానాలు ఇచ్చారు. దాదాపు 40 నిమిషాల సమయం వరకు రాజకీయం, పవన్ […]

’ఆహా‘ ఓటీటీలో నందమూరి బాలక్రిష్ణ హోస్ట్ గా టాక్ షో అన్ స్టాపబుల్ రన్ అవుతోంది. అయితే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చేసిన ఎపిసోడ్ పార్ట్-1లో కాస్త సినిమాలు, పర్సనల్ ఇష్యూస్ ని టచ్ చేసినప్పటికీ.. ఇప్పుడీ సెకండ్ పార్ట్ లో పూర్తిగా రాజకీయంగానే షో నడిచింది. షోలో బాలయ్య అడిగిన కొన్ని ప్రశ్నలకు పవన్ స్ట్రయిట్ గానే సమాధానాలు ఇచ్చారు. దాదాపు 40 నిమిషాల సమయం వరకు రాజకీయం, పవన్ కు కలిసొచ్చే రాజకీయ ఎలివేషన్లు, పార్టీ కార్యాచరణపైనే సో నడిచింది.

పవన్ కల్యాణ్ ఎక్కడ సభ పెట్టినా జనాలు కిక్కిరిపోతారు. అభిమానులతోపాటు నార్మల్ పీపుల్ కూడా అటెండ్ అవుతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంత మంది జనాలను వచ్చినా ఆయనకు ఓట్లేసినట్టు కనిపించలేదు. ఆ కారణంతోనే ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిని చూడాల్సి వచ్చింది. ఇక సినిమా ఈవెంట్లు, ఫంక్షన్స్ కు పవన్ అటెండయితే అభిమానులు ఈలలు, అరుపులతో రచ్చ రచ్చ చేస్తుంటారు. వాళ్ల అరుపులను కంట్రోల్ చేయడానికి పవన్ చాలానే ప్రయత్నిస్తుంటారు, అప్పుడు బరస్ట్ అవుతుంటారు.

అలా ఓ యంగ్ హీరో సినిమా ఫంక్షన్ లో పవన్ అసహనానికి గురైన సందర్భాలను చూశాం. అయితే ఇప్పుడు ఈ షోలో మీకు ఇంత మంది అభిమానులు, జనాలు వస్తున్నప్పటికీ ఎందుకు ఓట్లు పడలేదని సూటిగా బాలక్రిష్ణ ప్రశ్నించారు. పవన్ దానికి అంతే సూటిగా ‘‘ నా ఫ్యాన్స్ అంతా నాకు ఓటేయరు’’ అని సమాధానం ఇచ్చారు.

అభిమానం వేరు, అది ఓట్లుగా మారడం వేరు. దాని కోసం దశాబ్దాలు కష్టపడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి నాకు దశాబ్దానికి పైగా పట్టింది. పాలిటిక్స్ లో కూడా ఆ నమ్మకం తెచ్చుకోవడానికి అంతే కృషి చేయాలి. అప్పుడే అభిమానం ఓట్లుగా మారుతుంది. దీనికి టైమ్ పడుతుంది. ప్రజలకు మనపై నమ్మకం పెరగాలంటే గట్టిగా నిలబడాలి. ఓవర్ నైట్ లో అద్భుతాలు జరగవు. ఎట్లీస్ట్ పదిన్నరేళ్లు పడుతుంది. ప్రజెంట్ నమ్మకం సంపాదించుకునే స్థితిలో ఉన్నాను. మొత్తానికి ఈ టాక్ షో ద్వారా పవన్ కల్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ, అలాగే అభిమానులందరూ ఓట్లేయరన్న విషయాన్ని బయటపెట్టేశారు ఆయన. మరో వైపు ఆయన రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవంటూనే.. ప్రజా ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని చెప్పడం, గొప్పలు చెప్పుకున్నట్లుగానే ఉందంటున్నారు జనాలు

Updated On 13 Feb 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story