సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ కేసు గురించి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ కేసు గురించి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది. కనీసం హీరో కాకపోయినా సినిమా టీమ్ అయినా స్పందించి ఉండాల్సింది. మానవతా దక్పథం లోపించినట్టు అయింది అన్నారు పవన్.

ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేసారు అని అల్లు అర్జున్ పట్ల సానుభూతిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఏ హీరొకైన తమ సినిమా గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలని ఉంటుంది అని అన్నారు. హీరో అభిమానులకు అభివాదం చేయడం అనేది సహజం కానీ ముందుగా ఏర్పాట్లను గురించి అల్లు అర్జున్ చూసుకోవాల్సింది అన్నారు.

సినిమా పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరించింది. అంతకుముందు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. రేవంత్ పేరు మరిచిపోయారని అరెస్ట్ చేశారని అనడం సరికాదు అని అన్నారు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా కూడా అలాగే చేసేవారు చట్టం ఎవరికైనా సమానమే అని మీడియాతో చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ అన్నట్టు సమాచారం.

ehatv

ehatv

Next Story