పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హీరోగా వస్తున్న ఓజీ సినిమా(OG Movie) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. మరోవైపు విక్టరీ వెంకటేశ్(Venkatesh) నటిస్తున్న సైంధవ్‌(Saindhav) సినిమా కూడా రెడీ అవుతోంది. ఇంతకు ముందు ఇద్దరూ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఓజీ, సైంధవ్‌ సినిమా రెండూ ఓకేసారి విడుదలవుతే ఎలా ఉంటుంది?

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హీరోగా వస్తున్న ఓజీ సినిమా(OG Movie) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. మరోవైపు విక్టరీ వెంకటేశ్(Venkatesh) నటిస్తున్న సైంధవ్‌(Saindhav) సినిమా కూడా రెడీ అవుతోంది. ఇంతకు ముందు ఇద్దరూ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఓజీ, సైంధవ్‌ సినిమా రెండూ ఓకేసారి విడుదలవుతే ఎలా ఉంటుంది? బాక్సాఫీజ్‌ దగ్గర ఫైట్‌ రంజుగా ఉంటుంది కదూ! ఇదే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వెంకటేశ్‌ నటిస్తోన్న చిత్రం సైంధవ్‌ సినిమాను హిట్‌ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్‌ 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం అనుకుంటోంది. ఇప్పుటికే ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. సైంధవ్‌లో రుహానీ శర్మ, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సైంధవ్‌కు సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు పవన్‌కల్యాన్ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సినిమా ఓజీ.. దీనికి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. తాజా కబురు ప్రకారం ఓజీ కూడా డిసెంబర్‌ 22న విడుదల కాబోతున్నది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ దగ్గర పవన్‌, వెంకటేశ్‌ ఫైట్‌ ఎలా ఉండబోతున్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమా కూడా యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోంది. ఇందులో గ్యాంగ్‌లీడర్‌ ఫేం ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్ థమన్‌ అందిస్తున్నారు.

Updated On 26 Jun 2023 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story