సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న #PKSDT సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడిలా కనిపిస్తాడని సినీ వర్గాల సమాచారం. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం (Vinodhaya Sitha)కు రీమేక్‌గా PKSDT చిత్రం రూపొందుతోంది.

#PKSDT Title Is BRO
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న #PKSDT సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడిలా కనిపిస్తాడని సినీ వర్గాల సమాచారం. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం (Vinodhaya Sitha)కు రీమేక్‌గా PKSDT చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని (Samuthirakani) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చిత్ర టైటిల్‌ను అఫిషియల్‌గా ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా టైటిల్ ‘బ్రో’ (BR)) అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. చిత్ర ఫస్ట్ లుక్‌తోపాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్ వింటేజ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్ స్టైల్ అంతా కూడా బద్రీ నుంచి రిక్రియేషన్లా కనిపిస్తోంది.
మోషన్ పోస్టర్ చూస్తుంటే పవన్ కల్యాణ్ శివుడిని రిప్రజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మోషన్ పోస్టర్‌కు తమన్ (Thaman) ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంటెన్స్‌గా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలంటే బీమ్లా నాయక్‌కి ఇచ్చినంత బాగా ఈ మూవీకి బీజీఎం ఇవ్వలేదనిపిస్తోంది. ఇక ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రో చిత్రానికి డైలాగ్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో జీ స్టూడియోస్ కుడా భాగమై ఉంది. ఇక చిత్రం 2023 జులై 28న థియేటర్లలోకి రానుంది.
