పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి రీమేక్ అయిన వినోదయ సీతం (Vinodhaya Sitham) చిత్రం. సముద్రఖని (Samuthirakani) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) అందిస్తున్నారు.

#PKSDT Title Announcement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి రీమేక్ అయిన వినోదయ సీతం (Vinodhaya Sitham) చిత్రం. సముద్రఖని (Samuthirakani) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు 40 శాతం వరకు షూటింగ్ పూర్తయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్, అలాగే ఫస్ట్‌లుక్‌ను రేపు సాయంత్రం 4:14 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చిత్ర బృందం అఫిషియల్‌గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. అయితే అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ది టైమ్ హాజ్ కమ్ అని శివుడి డిజైన్‌తో ఉన్న ఫ్లయర్ విడుదల చేశారు మూవీ మేకర్స్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై #PKSDT అనే టైటిల్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సరసన కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్గా నటిస్తోంది. ఇక వినోదయ సీతం తెలుగు రీమేక్ తోపాటు క్రిష్ డైరెక్షన్ వస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, అండ్ అలాగే ఓజీ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
