పవర్ స్టార్ పవర్ కళ్యాణ్(Pawan kalyan) నటించి.. భారీ విదాలాకు దారి తీసిన బ్రో సినిమా అప్పుడే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ బ్రోమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు..? అందులో నిజమెంత...? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా బ్రో.

వివాదాలకు నెలవుగా నిలిచింది బ్రో(BRO) మూవీ.. రిలీజ్ అయ్యి నేలరోజులు కూడా అవ్వకుండానే ఓటీటీ(OTT) బాట పట్టబోతోందట.. ఇంతకీ స్ట్రీమిండ్ డేట్ ఎప్పుడో తెలుసా.

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్(Pawan kalyan) నటించి.. భారీ విదాలాకు దారి తీసిన బ్రో సినిమా అప్పుడే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ బ్రోమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు..? అందులో నిజమెంత...? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా బ్రో. సముద్రఖని(Samuthirakani) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా జులై 28న రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. . తమిళంలో వీనోదయ సీత్తం పేరుతో తెరకెక్కిన ఇదే సినిమాను తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖని... తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. వినోదయ సితం సినిమాకు తెలుగు రీమేక్ గా బ్రో మూవీ రూపొందింది.

కేతిక శర్మ, ప్రియా వారియర్.. హీరోయిన్లుగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన బ్రో మూవీలో తనికెళ్ళ భరణి, అలీ రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రోహిణి ఇతర ముఖ్య పాత్రలు చేశారు. బ్రో సినిమా పై ఎన్నో వివాదాలు.. అది కూడా సినిమా వివాదాలు కాదు.. రాజకీయావివాదాలు కూడా ఈసినిమాపై ఉద్రిక్తలు కలిగేలా చేశాయి. అయినా సరే రిలీజ్ అయ్యి..హిట్ టాక్ తెచ్చుకున్నాఈసినిమా కలెక్షన్ల పై కూడా పుకార్లు షికారు చేశాయి. గ్రాస్ పరంగా ఇప్పటికి 130 కోట్ల వరకు కలెక్షన్స్ అంటే..శేర్ పరంగా 65 కోట్ల వరకు సాధించింది బ్రో. ఇప్పటికే రజినీకాంత్, చిరంజీవి సినిమాలు రావడంతో.. ఆల్ మోస్ట్ అన్ని థియేటర్లలో బ్రో ను పక్కన పెట్టేశారు.

ఇక ఈసినిమా థియేటర్ రన్ అయిపోయింది.. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ ఆడియన్స్ లో డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది. చాలా మంది ఈసినిమాను ఓటీటీలో చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్రో సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. బ్రో సినిమా ఆగస్టు 25 లేదా 26న ఓటీటీ ప్లాట్ ఫామ్ మీదకు ఎక్కించబోతున్నారు. అది కూడా జీ5 ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఇంత వరకూ ఈ విషయం ప్రకటించలేదు. కాని నెట్టింట్ మాత్రం ఇదే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బ్రో సినిమాను వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం నాడు ఆగస్టు 25న జీ5 ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై త్వరలోనే అఫీషియల్ గా కూడా అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలస్తోంది. ఇక జీతో పాటుగా.. అమెజాన్ ప్రైమ్ లో కూడా బ్రో సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం.

Updated On 14 Aug 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story