పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. కోటానుకోట్ల అభిమానులకు అయితే ఈ రోజు మరీ మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజు. ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏమిటి....అంటే మార్చి 11వ తారీఖు అనమాట ఒక్కసారి టైమ్ ట్రావెల్లో గనక 27 ఏళ్ళ వెనక్కి వెళితే....ఈ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలైన రోజు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నాగార్జున మేనకోడలు సుప్రియ మొదటిసారి తెరకు పరిచయమయ్యారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. కోటానుకోట్ల అభిమానులకు అయితే ఈ రోజు మరీ మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజు. ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏమిటి....అంటే మార్చి 11వ తారీఖు అనమాట ఒక్కసారి టైమ్ ట్రావెల్లో గనక 27 ఏళ్ళ వెనక్కి వెళితే....ఈ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలైన రోజు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నాగార్జున మేనకోడలు సుప్రియ మొదటిసారి తెరకు పరిచయమయ్యారు. ఖయామత్ సె ఖయామత్ తక్ చిత్రం ఆదారంగా రూపొందిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి ఈనాటి ప్రముఖ రచయిత, నటుడు పోసాని క్రిష్ణ మురళీ కామెడీ ట్రాక్ అందించారు. కోటి సంగీతం అందించారు.

నిజానికి పనవ్ కళ్యాణ్ నటుడు కావాలని కలలు కనలేదు. ఆ కలలన్నీ దర్శకుడు కావాలని. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అంటారు. దైవం కూడా పవన్ కోసం గట్టిగానే తలచింది. పవన్ పెద్ద హీరోగా ప్రేక్షకలోకానికి అందించిందనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ప్రోద్బలమే ఎక్కువగా పవన్ కళ్యాణ్ హీరోగా మారడానికి దోహదపడింది. ఆమె పట్టుదల, సంకల్ప బలమే పవన్ పట్ల పెద్ద దీవెన అయింది. ఆమె ఆలోచన మేరకే మెగాస్టార్ కూడా పవన్ హీరో ఎంట్రీకి తల ఊపారు. ఇంకేముంది? సురేఖగారి సోదరుడు అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. అప్పటికి బాగా పీక్ లో ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు ఇవివి సత్యనారాయణను దర్శకుడిగా ఎంపిక చేసి చిత్రనిర్మాణానికి పూనుకున్నారు అరవింద్.

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర పెద్దగా రెస్పాన్స్ సాధించలేకపోయింది. షూటింగ్ టైంలో ఎన్నో విమర్శలు. మెగాస్టార్ తమ్ముడైనంత మాత్రాన హీరో అయిపోతాడా అని బాహాటంగానే మాట్లాడారు కొందరు ప్రబుద్ధులు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెవిన పడకపోలేదు. అన్నిటినీ విన్నాడు. సంయమనం పాటించాడు. సహనంతో ఓరిమితో నిలబడ్డాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చెప్పుకోదగ్గ విజయం సాధించకపోయినా, పవన్ మాత్రం తనని తాను నిరూపించుకోవాలనే ధ్యాసలో పడ్డాడు. వెంటనే వచ్చింది గోకులంలో సీత. కమర్షియల్ డైరెక్టర్ రేంజ్ లో లేకపోయినా సరే ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్యనే దర్శకుడిగా ఎంచుకున్నారు పవన్. ఈ చిత్రం తమిళ చిత్రం గోకులత్తిల్ సీత చిత్రానికి అనువాదంగా రూపొందింది. ఎవ్వరూ ఊహించని రీతిలో, విమర్శకులనందరినీ విస్మయానికి గురిచేస్తూ ఈ చిత్రం అదిరిపోయే విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్ స్థానాన్ని చిత్రపరిశ్రమలో కేవలం మెగాస్టార్ తమ్ముడిగానే కాకుండా సమర్ధుడైన ఓ కథానాయకుడిగా నిర్మాతలందరిలోనూ ఆశలు పెంచింది. వరుసగా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ జైత్రయాత్రకి బ్రేకుల్లేకుండా ముందుకు పరిగెట్టింది. 1996లో ప్రారంభమైన పవన్ కెరీర్లో మరు సంవత్సరం నుంచే విజయపరంపర ప్రారంభమైంది. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, తర్వాత ఖుషీ చిత్రం వచ్చిన 2001 వరకూ కూడా వపన్ కెరీర్ మాస్టర్ పీస్ ల తోనే నిండిపోయింది. ప్రతీ చిత్రానికీ పవన్ కళ్యాణ్ ఎదుగుతూ, పోటీయే లేని హీరోగా వేళ్ళూనుకున్నాడు. పైన చెప్పిన చిత్రాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏరికోరి ఎంచుకుని, అవకాశాలు కల్సించిన కొత్త దర్శకులతోనే ఛేస్తూ రావడమే ఇక్కడ హైలైట్. భీమనేని శ్రీనివాస్, కరుణాకర్, అరుణ్ ప్రసాద్, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చారు. క్రేజ్ ఉన్న డైరెక్టర్ల కోసం, మార్కెట్ ఉన్న టెక్నీషియన్స్ కోసం అర్రులు సాచి, అంగలార్చే ఈ చిత్రపరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రతిభను నమ్మి, తనమీద తనకు గల విశ్వాసంతో అప్పటివరకూ ముక్కూ మొహం తెలియనివారికి దర్శక గౌరవాన్ని కల్పించాడు. ఇంతటి సాహసం పరిశ్రమలో నిలదొక్కుకోవాలని కోరుకునే వారెవ్వరూ కూడా చెయ్యలేని సాహసమిది. ఇదిగో.... ఈ సాహసమే పవన్ కళ్యాణ్ క్రేజ్, డిమాండ్ రెండింటినీ అమాంతం పెంచేశాయి. పబ్లిక్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రాభవం బాగా విస్తారమై ఆయన కోసం సరికొత్త అభిమానుల బంగారు లోకం పుట్టుకొచ్చింది.

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే లోకంలో తనదైన మార్గాన్ని తనే ఏర్పరుచుకుని, తనకు తానే దిక్సూచిగా, తనకు తానే చుక్కానిగా అమర్చుకుని, అందరికీ అండగా దండగా మారి, నూతన ప్రపంచానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టాడు. అక్కడే మొదలైంది ఈ రోజున అందరూ గొప్పగా చెప్పుకునే పవనిజం ప్రారంభమైంది. తనకి ప్రాణానికి ప్రాణమైన తన అగ్రజుడు మెగాస్టార్ చిరంజీవి పేరును ఎక్కడా ఎప్పుడూ వాడుకోకుండా తన అడుగులలో తానే అడుగు వేసుకుంటూ, తన నీడను తానే దాటుకుంటూ, తర్వాతి తరం వారికి తన అడుగుజాడలను అపురూపమైన ఆనవాళ్లుగా వదిలిన ప్రత్యేకత ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కే చెందుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు.

కమర్షయల్ మార్కెట్ పవన్ కళ్యాణ్ని ఓ డెమీగాడ్ రేంజ్లో పరిగణించింది. మెగాస్టార్ మినహా ఎందరు హీరోలు పరిశ్రమలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వటవ్రిక్షంలా పెరిగిపోయాడు. ఆయన చేసిన సినిమాలు, ఆ క్యారెక్టర్లు, ప్రత్యేకంగా పవన్ తనతో పాటు తెచ్చుకున్న వినూత్నమైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ స్థాయిని విజయశికరాలకు చేర్చింది. పవన్ కొట్టేవాడే లేడన్నంత విశాలమైన ఇమేజ్ పవన్ కళ్యాణ్ సొంతమైంది. ప్రతీ అంశంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్స్ మెంట్, ఆయన స్ఫూక్తి ఆయా చిత్రాలకు చెప్పలేనంత బలాన్నిచ్చాయి. సంగీతంలో కూడా పవన్ కి ఎంతో అభినివేశం ఉంది. అందువల్లనే రమణ గోగుల వంటి సంగీత దర్శకుడికి అవకాశం కలిగింది. ఆనందసాయి లాటి ప్రతిభావంతుడికి ఆర్ట్ డైరెక్టర్కి స్థానం దక్కింది. ఒకే చిత్రాన్ని ఇద్దరు చేసినా కూడా పవన్ చేసిన సినిమా పూర్తిగా విభన్నంగా, సరొకొత్తగా కనిపించడానికి అదే ముఖ్య కారణం. ఖుషీ సినిమా తమిళంలో ముందు ఎస్ జె సూర్య ఛేశాడు. తెలుగులో పవన్ చేశాడు. ఈ రెండింటినీ గనక చూస్తే తెలుగులో పవన్ చేసిన వెర్షన్ ఎంత ఇంట్రస్టింగ్ గా టుందో అర్ధమవుతుంది. దానికి కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రమేయమే. ఆ ప్రమేయానికి కూడా మరో కారణం ఉంది. అది పనవ్ కళ్యాణ్ ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, కూలంకషంగా అవగాహన చేసుకుని, దానిని పూర్తిగా, పరిపూర్ణంగా వంటబట్టించుకుని అందులోకి పరకాయప్రవేశం చేయడమే. ఏదో రెమ్యూన్రేషన్ ఫిక్స్ అయింది, నిర్మాత దర్శకుడు చూసుకుంటారులే అనే ఉదాసీనభావానికి వవన్ కళ్యాణ్ పూర్తిగా బద్ధ వ్యతిరేకి. అన్నిటిలోనూ తానూ ఓకడై, అందరితోనూ కలసి అడుగులేయడం పవన్ కళ్యాణ్ లోని జీవ లక్షణం. ఆ గుణమే, ఆ నైజమే ఆయన్ని అందరికీ ప్రియుణ్ణి చేసింది. నిర్మాత వెనుకే ఉంటాడు. దర్వకుడికి ముందే ఉంటాడు. ఇది కదా ఓ హీరోకి కావాల్సిన, ఉండాల్సిన ముఖ్య లక్షణం. అదే పవన్ కళ్యాణ్ని సినిమా ట్రేడ్ కి కింగ్ ని చేసింది. ఓకే...పవన్ కళ్యాణ్ కూడా ఫ్లాప్ లకి అతీతుడు కాడు. తప్పిదాలు మానవజీవితాన్ని ఒరుసుకుంటూ పరిగెడుతుంటాయి. ఆ తప్పిదాలు కథలు ఎంపిక చేసుకోవడంలోనో, కథని సీన్స్ గా మలుచుకోవడమో ఎక్కడో మానవ తప్పిదం జొరబడుతుంది.

గబ్బర్ సింగ్ చిత్రం వరకూ కూడా....ఆయా చిత్రాల పేర్లు కూడా నేనిక్కడ ప్రస్తావించబోవట్టేదు. ఇండియన్ షో మేన్ అని కీర్తింపబడిన రాజ్ కపూర్ కూడా మేరా నామ్ జోకర్ లాటి దారుణ ఫ్లాపులు తీసి నడిరోడ్డున నిలబడిన సంఘటనలను ఇండియన్ సినిమా పరికించింది. అవేవో పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ఉండనే ఉన్నాయి. కానీ గబ్బర్ సింగ్ వరకూ వచ్చేసరికి ఒక ప్లస్ పాయంట్ అదనంగా కలిసొచ్చింది. అదేంటంటే...దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా పవన్ కళ్యాణ్ గొప్ప అభిమాని. గత సినిమాలలో ఎక్కడ తన అభిమాన కథానాయకుడి చిత్రాలలో పొరబాట్లు ఎక్కడ జరిగాయో....గబ్బర్ సింగ్ కథని తెలుగుకి అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు వాటిని బాగా స్టడీ చేసి చేసి, తనొక వెర్షన్ తయారుచేసుకున్నాడు. తను హిట్ కొట్టాలన్న తాపత్రయం కన్నా కూడా హరీష్ ఎక్కువగా నమ్మింది తనలాటి కోట్టాదిమంది కళ్యాణ్ అబిమానులు ఏ విధంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారో అటువంటి కళ్యాణ్ పోషిస్తున్న పాత్రని అందంగా తయారుచేసుకున్నాడు. తిరుగులేని రీతిలో చెక్కుకున్నాడు. అభిమానే దర్శకుడైతే ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందోనన్న సంజాయిషీకి గబ్బర్ సింగ్ ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. తిరుగులేని ఎగ్జాంపుల్. మళ్ళీ పనవ్ కళ్యాణ్ అభిమానులు, హరీష్ శంకర్ తో సహా కాలర్ ఎగరేసంత, ఎగరేయగలిగేంత పెద్ద హిట్ సినిమా ప్రపంచాన్ని షేక్ చేసింది. హరీష్ శంకర్ అనుసరించిన ఆ కొలతేలేవో తర్వాత సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకులు అనుసరించలేకపోయారనిపించింది. ఆ మేరకు ఆ సినిమాలు కూడా అంత ఆశాజనకంగా లేకపోయాయి. ఇందులో పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటివాళ్ళు కూడా మినహాయింపు కాదు. మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాసే ప్రాపర్ స్క్రిప్టును, పరఫెక్టు క్యారెక్టర్ రెండింటితో ముందుకొచ్చాడు. ఫలితం...బాంబ్ షెల్ హిట్....అత్తారింటికి దారేది వచ్చి పడింది. దావానంలాటి విజయం మొత్తం అప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ దహించేసింది.
మళ్లీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఎ. ఎం. రత్నం, పవన్ కళ్యాణ్ అనే బంపర్ కాంబినేషన్ రిపీట్ అయింది. అదే హరిహరవీరమల్లు. హయ్యస్ట్ బడ్జెట్, భారీ సెట్లు, పీరియడ్ డ్రామాతో విభిన్నదర్శకుడు అని పేరుపడ్డ క్రిష్ చేసిన కథని నిర్మాత రత్నం తలకెత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ చిత్రాలలోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక పక్కన తన జనసేన కార్యక్రమాలను, పొలిటికల్ ప్రోగ్రామ్స్ వేటికీ ఇబ్బంది లేకుండా, సినిమా షూటింగ్ ప్రొసీడింగ్స్ ఇబ్బంది పడకుండా హరిహరవీరమల్లు రూపుదిద్దుకుంటోంది. పెద్ద విజయం సాధిస్తుందని అందరి అంచనా. నిర్మాత, తర్శకుడు అంచనాలు కూడా.

తరచూ పనవ్ కళ్యాణ్ అనే మాట ప్రశ్నిస్తానని. ఈ ప్రశ్నే ఈ కథలో ముఖ్యాంవం అని చెబుతున్నారు. పీరియడ్ సినిమాలో ఓ సామాన్యుడు ఆ రాజ్యానికి బాద్షాని ఎటాక్ చేస్తాడు. ఎదిరిస్తాడు అన్నది వినికిడి. ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు నచ్చే అన్ని అంశాలు అంటే ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ పుష్కలంగా సమకూరాయని యూనిట్ మొత్తం గొప్ప ఆనందంగా ఉన్నారు.
జనసేన ప్రారంభం...ప్రయాణం...ప్రభంజనం

జనసేన 2014లొ అభినందనీయమైన ఆశయాలతో ఆవిర్భవించింది. కోటానుకోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటూ, హంసతూలికాతల్పాలపైన శయనించి, అర్థ్యపాదాలను అందుకుంటూ, ఇంటి చుట్టూ డబ్బుల సంచులు పట్టుకు తిరిగే నిర్మాతల సైన్యం ఉండగా....కేవలం ఒకే ఒక్క ఆశయంతో పవన్ కళ్యాణ్ ప్రజాసేవరంగంలో పాదం మోపాడు. రాజకీయరంగంలోకి అడుగుపెట్టాడని రాయలేను. రాజకీయరంగం, ప్రజాసేవరంగం రెండు కవలపిల్లలు. ఒకటి సద్గుణరాశి. మరొకటి దుర్గుణాల రాకాసి. కానీ పవన్ కళ్యాణ్ మనుగడ కోసం ప్రజాసేవరంగంలోకి అడుగుపెట్టలేదు. ఎందుకంటే అస్థిత్య సమస్య ఆయనకి లేదు. మనుగడా....ప్రశ్నార్ధకం కాదు. పదవులు, కుర్చీలు ఉంటేనే గానీ జరుగుబాటు లేదన్న స్రమాదం ఉత్పన్నమయ్యే పరిస్థితి పవన్ కళ్యాణ్ నిఘంటువులోనే లేదు. రాదు. మరి ఎందుకొచ్చినట్టు?

అదే ఇక్కడ చాలా ముఖ్యమైన, కీలకమైన అంశం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అనే శ్రీశ్రీ గారి పాటలాగా, జరుగుతున్న అక్రమాలను, అరాచకాలను ఎవరో ఒకరు ఎదుర్కనకపోతే ప్రజాజీవితాలు అధ్వాన్నమైపోతాయనే సీరియస్ థాట్ పవన్ ఇటువైపుగా మళ్ళించాయి. ఆ ప్రేరణని పూర్తిగా వంటబట్టించుకుని ముందడుగు వేసిన పవన్ సముద్ర కెరటంలా జనవేదికపైన విశ్రింకలంగా ప్రవహిస్తున్నాడు. దానికి ఆయన అబిమానులే కాదు....సగటు పౌరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, భారతీయ సమాజం అంతా మూకమ్మడిగా పవన్ని అభినందిస్తున్నాయి. ఆదరిస్తున్నాయి. పవన్ సిద్దాంతాన్ని గౌరవించి, అక్కున చేర్చుకుంటున్నాయి. అంతం కాదిది. కేవలం ఆరంభం మాత్రమే. చూడాల్సిన జనచిత్రం ఇంకా టైటిల్స్ లోనే ఉంది. పవన్ ఎక్కడికి వెళితే అక్కడ జనసందోహాలు కెరటెమెత్తుతున్నాయి. వెల్లువలా పెల్లుబుకుతున్నాయి. ఆయన అడుగులే ఆదర్మంగా పరిగెడుతున్నాయి.

పనవ్ కళ్యాణ్ పాత్రధారి కాదు...సూత్రధారి. పనవ్ కళ్యాణ్ ఆయనే ఒక పాత్ర. అందరూ ఇటువంటి పాత్ర సజీవంగా తమకోసం, తమ శ్రేయస్సు కోసం నిలబడితే బావుణ్ణు అని కలలు గన్న పాత్ర. ఆ పాత్రే ఇప్పడు చిత్రప్రపంచం నుంచి బైటకు అడుగుపెట్టి, జనసముద్రం మధ్యకు వెళ్ళి, వారి గొంతే తన గొంతుగా, వారి గుండే తన గుండెగా, వారి అడుగే తన అడుగుగా కదలిపోతున్నాడు. కడలిలా ఉప్పొంగుతున్నాడు.

రచయిత : నాగేంద్రకుమార్

Updated On 13 March 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story