పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఊర మాస్ పోలీస్ లుక్ లో ఫ్యాన్స్ ను అలరించబోతున్నారు.. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలోనే పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేసారు.. ఈ సినిమా పవన్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది.. మళ్లీ అదే కాంబో రిపీట్ అవడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.

pawan kalayan harish shankar’s Ustaad Bhagat Singh First Glimpse out now
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఊర మాస్ పోలీస్ లుక్ లో ఫ్యాన్స్ ను అలరించబోతున్నారు.. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలోనే పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేసారు.. ఈ సినిమా పవన్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది.. మళ్లీ అదే కాంబో రిపీట్ అవడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ ఈ సినిమాలో మహంకాళి ఏరియా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.. మహా భారతంలోని శ్లోకంతో ప్రారంభమైన గ్లింప్స్ ఈ సరి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది అంటూ ఊర మాస్ డైలాగ్‌తో అదరగొట్టింది.. పాత బస్తీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను అరికట్టే ఒక సిన్సియర్ పోలీస్‌గా పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని హరీష్‌శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు పంకజ్ త్రిపాఠి, అషుతోష్ రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
