యాక్టర్ నరేష్(Naresh) తో సహాజీవనంతో హైలెట్ అయ్యింది.. సీనియర్ నటి పవిత్ర లోకేష్(Pavitra Lokesh).. ఇప్పటికీ వీరిద్దిరిపై హాట్ హాట్ న్యూస్ లు వైరల్ అవుతుంటాయి. అటువంటిది పవిత్ర లోకేష్ కు సబంధించిన తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
యాక్టర్ నరేష్(Naresh) తో సహాజీవనంతో హైలెట్ అయ్యింది.. సీనియర్ నటి పవిత్ర లోకేష్(Pavitra Lokesh).. ఇప్పటికీ వీరిద్దిరిపై హాట్ హాట్ న్యూస్ లు వైరల్ అవుతుంటాయి. అటువంటిది పవిత్ర లోకేష్ కు సబంధించిన తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఎప్పటి నుంచో స్టార్ యాక్ట్రస్ గా కన్నడ తమిళ భాషల్లో వెలుగు వెలుగుతున్న నటి పవిత్ర లోకేష్. బాగా పాప్యులరిటీ సాధించిన ఈ నటి సీనియర్ నటుడు నరేశ్ తో ఆమె సహజీవనంతో బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు. కన్నడ యూనివర్శిటీ(Kannada University) నిర్వహించిన పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో(PHD Common Entrance Exam) పవిత్ర లోకేష్ పాస్ అయ్యారు. కన్నడ యూనివర్శిటీ వివిధ విభాగాల కింద పీహెచ్డీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. వివిధ విభాగాల్లో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయగా... వీరిలో 259 మంది మాత్రమే పాస్ అయ్యారు. అందులో పవిత్ర కూడా ఉన్నారు.
తనకు కన్నడలో పీహెచ్డీ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు పవిత్ర. గతంలో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా బెల్గాం ఎక్స్ టెన్షన్ సెంటర్ లో పరిశోధన చేసేందుకు పవిత్ర పరీక్ష రాశారు. కొన్ని వారాల క్రితం నరేష్.. పవిత్రని బళ్లారి తీసుకువెళ్లి అక్కడ హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాయించారు. దగ్గరుండి తన పార్ట్నర్ ని నరేష్ పరీక్ష రాయించడం విశేషం. . మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన పవిత్రకు ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లేటు వయసులో ప్రేమలో పడ్డారు నరేష్, పవిత్ర. ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈక్రమంలో వీరు సృష్టించని వివాదం అంతా ఇంతా కాదు. ఎన్నివిమర్శలు వచ్చినా.. ఏమాత్రం భయపడకుండా.. తమ రిలేషన్ ని నరేష్, పవిత్ర ధైర్యంగా కొనసాగిస్తున్నారు. ఎంత వివాదం అయితే అంతగా బలపడుతుంది వారి బంధం. అయితే వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలసి జీవిస్తూ ప్రేమలో మునిగితేలుతున్నారు. తమ రిలేషన్ పై క్లారిటీ ఇవ్వడం కోసం.. వారి లైఫ్ స్టోరీని మళ్ళి పెళ్లి అనే సినిమా చేశారు నరేష్ పవిత్ర పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం, లేటు వయసులో వరుస పెళ్లిళ్ల కారణంగా ఈ జంటపై ట్రోలింగ్ జరిగింది.