కన్నడ హీరో దర్శన్‌(Darshan), నటి పవిత్ర గౌడ(Pavitra Gowda) ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

కన్నడ హీరో దర్శన్‌(Darshan), నటి పవిత్ర గౌడ(Pavitra Gowda) ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఓ అభిమాని హత్య కేసులో(Murder case) వీరిద్దరు చిక్కుకున్నారు. గత పదేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపిస్తుండటం, ఆ విషయం తన ప్రియుడు దర్శన్‌కు పవిత్ర చెప్పడం, ఆ కోపంతో దర్శన్‌ అతడిని మట్టుపెట్టడం ..ఇవన్నీ తెలిసిన విషయాలే! అయితే పవిత్ర గౌడ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆమెకు ఎప్పడో పెళ్లయ్యింది. ఎదిగిన కూతురు ఉంది. ఆదివారం ఫాదర్స్‌ డే(Father's Day) సందర్భంగా పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ(Kushi Gowda) చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్‌ డే' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ గౌడ పెట్టిన పోస్టుతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పవిత్ర గౌడ 18 ఏళ్ల వయసున్నప్పుడే సంజయ్‌ సింగ్‌తో పెళ్లయ్యింది. వీరిద్దరికి ఖుషీ అనే కూతురు ఉంది. తర్వాతి కాలంలో సంజయ్‌సింగ్‌తో(Sanjay singh) పవిత్ర గౌడ విడాకులు తీసుకుంది. పదేళ్లుగా హీరో దర్శన్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలో దర్శన్‌తో కలిసి దిగిన రొమాంటిక్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 2013లో వచ్చిన కామెడీ సినిమా చత్రిగలు సార్‌ చత్రిగలుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Eha Tv

Eha Tv

Next Story