సినీ నటి పావలా శ్యామల(Pavala Shyamala) పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన శ్యామల నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. తనను ఆదుకోమంటూ అర్థిస్తున్నారు. ఓవైపు ఆర్ధిక భారం, మరోవైపు వయోభారం ఆమెను అమితంగా బాధిస్తున్నాయి.

Pavala Shyamala
సినీ నటి పావలా శ్యామల(Pavala Shyamala) పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన శ్యామల నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. తనను ఆదుకోమంటూ అర్థిస్తున్నారు. ఓవైపు ఆర్ధిక భారం, మరోవైపు వయోభారం ఆమెను అమితంగా బాధిస్తున్నాయి. దీంతో పాటు ఎదిగిన కూతురు మంచానికే పరిమితం కావడం ఆమె మనోవేదనను రెట్టింపు చేసింది. ఈమె పరిస్థితి చూసి కొందరు ఆర్ధికంగా ఆదుకున్నా అవి తాత్కాలక ఉపశమనం మాత్రమే కలిగించింది. ఆమెకు వచ్చిన అవార్డులను అమ్ముకుని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
ఒక్కోసారి తిండి లేక అయిదారు రోజులు పస్తులున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు తల్లిబిడ్డలిద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కంటతడి పెట్టుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదని దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మరీ చెప్పారు.
రంగస్థలంలో మంచి పేరు సంపాదించిన పావలా శ్యామలను జంధ్యాల వెండితెరకు పరిచయం చేశారు. 1984లో వచ్చిన బాబాయ్ అబ్బాయి(Babai abbai) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పావలా శ్యామల. స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్‌తో పాటు సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించారు.
అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్న ఆమె నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడ(peerzadiguda) లోని ఓ వృద్దాశ్రమంలో(Oldage Home) ఉంటున్నారు. ఆ ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునేవారు కింద ఇస్తున్న బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపించవచ్చు.
Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Branch , Hyderabad , Cell : 9849175713.
