బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా(Parineeti Chopra) ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) యువ నాయకుడు రాఘవ్ చద్దాను(Raghav Chadha) పెళ్లి చేసుకున్నారు. గత నెలలో రాజస్థాన్‌లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు నుంచే ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు పరిణితి చోప్రా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పరిణితి చోప్రా సినిమాల కంటే ఇతర విషయాలనే అందులో పోస్టు చేస్తుంటారు. ఆమె పెట్టే కొన్ని పోస్టులు సంచలనం రేపుతాయి.
బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా(Parineeti Chopra) ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) యువ నాయకుడు రాఘవ్ చద్దాను(Raghav Chadha) పెళ్లి చేసుకున్నారు. గత నెలలో రాజస్థాన్‌లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు నుంచే ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు పరిణితి చోప్రా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పరిణితి చోప్రా సినిమాల కంటే ఇతర విషయాలనే అందులో పోస్టు చేస్తుంటారు. ఆమె పెట్టే కొన్ని పోస్టులు సంచలనం రేపుతాయి. ఫలితంగా ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోయినా స్టార్ స్టేటస్ మాత్రం ఆమెకు కంటిన్యూ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీలు,రెస్టారెంట్లు అంటూ ఎంజాయ్ చేశారు. అలా పలుమార్లు కెమెరాల కంట కనిపిస్తూ ట్రెండ్ అయ్యారు. ఇలా వారిద్దరూ వైరల్ అయ్యాక కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.ఇదిలా ఉంటే పరిణితి చోప్రా పెళ్లి తర్వాత తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాఘవ్ చద్దాతో వివాహం తర్వాత పరిణితి చోప్రా హానీమూన్ ప్లాన్‌ను గ్రాండ్ చేసుకుంటారని చాలా మంది భావించారు. కానీ ఎవరూ ఊహించిని విధంగా భర్త లేకుండానే మాల్దీవుల(Maldives) వెకేషన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు పరిణితి చోప్రా. కానీ ఆమె ఈ వెకేషన్‌కు భర్తతో కాకుండా తన మరదలతో వెళ్లారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పుకున్నారు 'నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్'(Girls Trip) అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు పరిణితి. దీంతో మరదలితో హనిమూన్ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళితే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి అంటూనే వివాహం జరిగి నెల కూడా కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.