పాత సంవత్సరానికి బై చెప్పేసి కొత్త సంవత్సరానికి హాయ్‌ చెప్పేశాం! నూతన సంవత్సరం (New Year) కాబట్టి కొందరు కొన్ని రిసల్యూషన్స్‌ (Resolutions)కూడా తీసుకున్నారు. పాటించడం పాటించకపోవడం వారిష్టం. ఇక సినిమా (Film industry) పరిశ్రమ విషయానికి వస్తే ఈ ఏడాది పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా మహేశ్‌బాబు (Maheshbabu) గుంటూరు కారం (Guntur Karam)విడుదల కానుంది.

పాత సంవత్సరానికి బై చెప్పేసి కొత్త సంవత్సరానికి హాయ్‌ చెప్పేశాం! నూతన సంవత్సరం (New Year) కాబట్టి కొందరు కొన్ని రిసల్యూషన్స్‌ (Resolutions)కూడా తీసుకున్నారు. పాటించడం పాటించకపోవడం వారిష్టం. ఇక సినిమా (Film industry) పరిశ్రమ విషయానికి వస్తే ఈ ఏడాది పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా మహేశ్‌బాబు (Maheshbabu) గుంటూరు కారం (Guntur Karam)విడుదల కానుంది. దీనిపై మహేశ్‌ ఫ్యాన్స్‌ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీంతో పాటు నాగార్జున (Nagarjuna) నటించిన నా సామిరంగ, రవితేజ (Raviteja) నటించిన ఈగల్‌, వెంకటేశ్‌ (Venkatesh)నటించిన సైంధవ్‌ సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు హనుమాన్‌ (Hanuman)కూడా ఉంది. ఆ తర్వాత పాన్‌ ఇండియా సినిమాల చిట్టానే ఎక్కువగా ఉంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప -2, ప్రభాస్‌ నటిస్తున్న కల్కి, ఎన్టీఆర్‌(NTR) సినిమా దేవర, రామ్‌చరణ్‌ (Ramcharan)హీరోగా గేమ్‌ ఛేంజర్‌ కూడా ఈ ఏడాది రిలీజ్‌ కాబోతున్నాయి. పుష్ప -2 సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన సాతంత్ర్యదినోత్సవం కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. స‌లార్‌తో సూపర్‌హిట్‌ను అందుకున్న ప్ర‌భాస్ త్వ‌ర‌లో క‌ల్కి చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు.
ఇక ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ (Koratala Shiva) తెర‌కెక్కిస్తున్న దేవ‌ర మొదటి భాగం ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కానుంది. ఇక రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబోలో రూపొందిన గేమ్ చేంజ‌ర్ చిత్రం వేసవిలో రానుంది. అలాగే భారీత‌యుడు 2 చిత్రాన్ని కూడా వ‌చ్చే ఏడాది వీలైనంత తొంద‌ర‌గా రిలీజ్ చేయాల‌ని శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ఎన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారో, అభిమానిస్తారో చూడాలి.

Updated On 1 Jan 2024 3:41 AM GMT
Ehatv

Ehatv

Next Story