రెండేళ్ల కిందట అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Director Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప సినిమా(Pushpa Movie) దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అసలు సిసలు పాన్ ఇండియా మూవీ(Pan India Movie) అనిపించుకుంది. సినిమాలో బన్నీ మేనరిజం, పాటలు బాగా పాపులరయ్యాయి. ఇప్పుడు పుష్ప సీక్వెల్ రూపొందుతోంది.

Pushpa The Rule
రెండేళ్ల కిందట అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Director Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప సినిమా(Pushpa Movie) దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అసలు సిసలు పాన్ ఇండియా మూవీ(Pan India Movie) అనిపించుకుంది. సినిమాలో బన్నీ మేనరిజం, పాటలు బాగా పాపులరయ్యాయి. ఇప్పుడు పుష్ప సీక్వెల్ రూపొందుతోంది. పుష్ప-2 ది రూల్(Pushpa The Rule) పేరుతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప -2 సినిమా షూటింగ్‌లో చాలా భాగం పూర్తయింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు కానీ అంతకంటే ముందుగానే సినిమా విడుదల కావొచ్చని అనుకుంటున్నారు. డిసెంబర్ చివరి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని కన్ఫామ్ చేయనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
