మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన కింగ్ ఆఫ్ కోతా(King Of Kotha) సినిమా కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 24న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కాబోతున్నది. మహానటి(Mahanati), సీతారామం(Sitharamam) సినిమాలతో దుల్కర్ తెలుగువారికి చాలా దగ్గరయ్యారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన కింగ్ ఆఫ్ కోతా(King Of Kotha) సినిమా కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 24న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కాబోతున్నది. మహానటి(Mahanati), సీతారామం(Sitharamam) సినిమాలతో దుల్కర్ తెలుగువారికి చాలా దగ్గరయ్యారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో జరిపారు. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని(Nani), దగ్గుబాటి రానా(Rana Daggubati) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలే కాస్త వివాదం రేపుతున్నాయి. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని అంటున్నాం.
ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన నటీనటులలో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ సల్మాన్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రీప్టు రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడు కూడా అతని కోసం కథ రాసుకుంటాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదే' అని తెలిపాడు. ఇది టాలీవుడ్‌లోని పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్‌కు బాగా కోపం తెప్పించింది. వీరంతా నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుల్కర్ గొప్ప నటుడే, పాన్ ఇండియా రేంజ్‌ను అందుకునే అర్హత దుల్కర్‌కు ఉంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవని అంటూనే నాని వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా అంటావు నాని అంటూ ఓ రేంజ్‌లో తెలుగు సినిమా హీరోల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కి నాని ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే అతడికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు. 'దక్షిణ భారత్‌లో ప్రస్తుతం అగ్ర హీరోల్లో అందరి కంటే ముందుగా బాలీవుడ్‌లో సంచలనం రేపిన నటుడు ప్రభాస్. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వీరందరినీ గల్లీ హీరోలని అనుకుంటున్నావా నాని అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి నాని ఎవడు? సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటి దురుసు తగ్గించుకుంటే బాగుంటుంది .' అని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.