విదేశీ ఛానెళ్ల నుంచి దిగుమతి చేసుకున్న బిగ్‌బాస్ షో(Bigg Boss) మన దగ్గర మొదట హిందీలో వచ్చింది. అక్కడ విజయవంతంకాగానే దేశంలోని మిగతా భాషల్లో కూడా టెలికాస్ట్ కావడం మొదలయ్యింది. ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని భాషలలో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్.
విదేశీ ఛానెళ్ల నుంచి దిగుమతి చేసుకున్న బిగ్‌బాస్ షో(Bigg Boss) మన దగ్గర మొదట హిందీలో వచ్చింది. అక్కడ విజయవంతంకాగానే దేశంలోని మిగతా భాషల్లో కూడా టెలికాస్ట్ కావడం మొదలయ్యింది. ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని భాషలలో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సీజన్ సెవన్ విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏడాది కొత్త కొత్త పోకడలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇంతలా ఆదరణ పొందిన రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. బిగ్‌బాస్ షో ద్వారా కొందరు సినీరంగంలో అడుగుపెట్టి అక్కడ కూడా ఫేమస్ అయిన సందర్భాలను చూశాం.
అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు(Contestants) ఎంత పారితోషికం ఇస్తారన్న దానిపై చాలా మందికి క్యూరియాసిటీ ఉంది. తెలుగు బిగ్‌బాస్(Telugu Bigg Boss) షో విషయానికి వస్తే ఇక్కడ రెమ్యునిరేషన్లు(Remuneration) బాగానే ఉంది. కొందరికి లక్షల్లోనే ఉందని వింటున్నాం. ఎలిమినేట్ అయినవారు తాము అందుకున్న రెమ్యునరేషన్ గురించి ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలిగించవచ్చు . కొందరు నమ్మకపోవచ్చు కూడా! బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ కేవలం మూడు రోజులకే రెండు కోట్ల రూపాయలు అందుకున్నారు. హిందీలో బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సుప్రసిద్ధ నటుడు సల్మాన్‌ఖాన్(Salman Khan) వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే! అయితే బిగ్‌బాస్ సీజన్-4లో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్(Pamela Anderson) బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు.
కేవలం మూడు రోజులు మాత్రమే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు సుమారు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్‌తోనే సల్మాన్ ఖాన్ మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత అత్యధికంగా పారితోషికం అందుకున్న వ్యక్తి తేజస్వి ప్రకాశ్(Tejaswi Prakash). బిగ్‌బాస్-15లో విజేతగా నిలిచిన ఆయనకు 1.7 కోట్ల రూపాయల పారితోషికాన్ని చెల్లించారు. కాగా, పమేలా ఆండర్సన్ కెనడియన్-అమెరికన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు దక్కించుకుంది.
ప్లేబాయ్ మ్యాగజైన్‌లో తన మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సిరీస్ బేవాచ్‌లో సీజే పార్కర్(CJ Parker) పాత్రతో ఆమె ఫేమస్ అయింది. పమేలా ఆండర్సన్ తన బాల్యంలో లైంగిక వేధింపులకు(Molestation) గురయ్యారు. 2014లో ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆరు నుంచి పదేళ్ల వయసులో ఓ మహిళ తనను వేధించిందని, ఆ తర్వాత 12 ఏళ్లకే పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని తెలిపారు. ఆమెకు 14 ఏళ్ల వయసులో తన ప్రియుడితో పాటు, అతని ఫ్రెండ్స్ ఆరుగురు అత్యాచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.