రసవత్తరంగా సాగుతోంద బిగ్ బాస్(Bigg Boss 7) తెలుగు సీజన్ 7. ఈసారి కాస్త డిఫరెంట్ గా ..హౌస్ ను రన్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఈక్రమంలో అన్ని సీజన్లను మించి ఘాటు విమర్షలతో.. జోరుగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. ఈసారి ఇంకాస్త శృతిమించిన గొడవలు జరుగుతుండగా.. వారికిసపోర్ట్ గా బయట కూడా ఫ్యాన్స్ మాటల యుద్దం జరుగుతూనే ఉంది.

రసవత్తరంగా సాగుతోంద బిగ్ బాస్(Bigg Boss 7) తెలుగు సీజన్ 7. ఈసారి కాస్త డిఫరెంట్ గా ..హౌస్ ను రన్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఈక్రమంలో అన్ని సీజన్లను మించి ఘాటు విమర్షలతో.. జోరుగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. ఈసారి ఇంకాస్త శృతిమించిన గొడవలు జరుగుతుండగా.. వారికిసపోర్ట్ గా బయట కూడా ఫ్యాన్స్ మాటల యుద్దం జరుగుతూనే ఉంది.

ఇప్పటికే ఎనిమిదో వారం వీకెండ్‌ వరకూ సీజన్ 7 వచ్చేసింది. హౌస్ లో వాడీ వేడీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎదురు పడి కొట్లాడుకోవడమే తక్కువ కాని.. మాటల యుద్దాలు చేసుకుంటూ.. దాదాపుగా అంతే చేస్తున్నారు. ఇక గేమ్స, టాస్క్ ల విషయం ఎవరికి వారు.. పోటా పోటీగా కష్టపడుతున్నారు. లోపల ఎంత రచ్చ జరుగుతుందో.. బయట కూడా వారి ఫ్యాన్స్ మధ్య అదే రచ్చ కొనసాగుతోంది బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్లు హౌజ్‌ మేట్స్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారు.

తాజాగా అమర్‌ దీప్‌ చౌదరికి(Amardeep Chaudhary) సపోర్టుగా నిలిచింది సీనియర్ హీరోయిన్‌ రాశి(Rashi). తన కొడుకుని గెలిపించాలంటూ ఒక వీడియో విడుదల చేసిందీ రాశీ అమర్ దీప్ కు తల్లిగా నటిస్తోంది. జానకి కలగనలేదు(Janaki Kalaganaledhu) సీరియల్‌లో రాశి, అమర్‌ దీప్‌ చౌదరి తల్లీ కొడుకులుగా నటించారు. జ్ఞానాంబ పాత్రలో రాశి, ఆమె కుమారుడిగా రామా అమర్‌ దీప్‌ నటించి మెప్పించారు. ఇక ఈసీరియల్ లో జానకిగా నటించిన ప్రియాంక(Priyanka) కూడా బిగ్ బాస్ హౌస్(Bigg Boss House) లో ఉంది. ఇక ఈ నేపథ్యంలో అమర్‌ దీప్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌కు వెళ్లడంతో తన కొడుకుకు ఓటేయమంటూ రాశి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో రిలీజ్‌ చేసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాశీ అమర్‌ దీప్‌కు సపోర్టుగా నిలవడం చాలా మందికి నచ్చ లేదు. ఆమె అలా వీడియో పెట్టడంతోనే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth) ఫ్యాన్స్‌ లైన్‌లోకి వచ్చారు. రాశిని ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెట్టారు. మీరు చెబితే మేం ఓటు వేయాలా? మా ఓటు రైతు బిడ్డకే, సీరియల్‌ బ్యాచ్‌ అందరూ గకలిసి గ్రూపిజం అడుతున్నారు మేడమ్‌. అతనికి ఎందుకు ఓటేయాలి?, ప్రతిసారి రైతు బిడ్డనే టార్గెట్‌ చేస్తున్నారు, ‘అసలు అమర్‌కు సరిగా మాట్లాడడమే రాదు, ‘దయచేసి అతనికి ఓటు వేయమని అడగకండి మేడం అని కామెంట్లు పెట్టారు ప్రశాంత్ ఫ్యాన్స్.

Updated On 28 Oct 2023 4:05 AM GMT
Ehatv

Ehatv

Next Story