నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం భగవంత్ కేసరి(Bagavanth Kesari) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిని చూసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం భగవంత్ కేసరి(Bagavanth Kesari) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిని చూసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ పాత్రలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల(Sreeleela) కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వదంతి ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం చిత్రబృందం ఉత్తరప్రదేశ్ భామ పల్లక్ లల్వానిని(Pallak Lalvani) సంప్రదించిందట.
పల్లక్ లల్వాని కూడా కీ రోల్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకు ముందు జువ్వ, అబ్బాయితో అమ్మాయి చిత్రాలలో పల్లక్ లల్వాని నటించారు. ఈ అందాల తార భగవంత్ కేసరిలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే! ఇప్పటి వరకు రాయలసీమ యాసలో అభిమానులను ఆకట్టుకున్న బాలకృష్ణ భగవంత్ కేసరిలో తెలంగాణ యాసతో(Telangana Slang) ఎంటర్‌టైన్ చేయనున్నాడు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించిన ఎస్.తమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.