బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌తో(Kangana Ranuth) తెలిసీ తెలిసీ ఎవరూ పెట్టుకోరు. నటన విషయంలో ఆమెను ఎవరూ తప్పుపట్టలేరు కానీ ఆమె నోరే మంచిది కాదు. ఎంతటివారినైనా తిట్టిపోస్తారు. ఎవరిని లెక్క చేయరు.. అందుకే తరచూ వివాదాల్లో కూరుకుపోతుంటారు. ఇప్పుడు కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ నటి నౌషీన్ షా(Nausheen Shah) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ గురించి అవగాహన లేకుండా కంగనా మాట్లాడుతుందని మండిపడింది. చెంపదెబ్బలు(Slap) కొట్టేందుకు కంగనాను కలవాలని ఉందని చెప్పింది.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌తో(Kangana Ranuth) తెలిసీ తెలిసీ ఎవరూ పెట్టుకోరు. నటన విషయంలో ఆమెను ఎవరూ తప్పుపట్టలేరు కానీ ఆమె నోరే మంచిది కాదు. ఎంతటివారినైనా తిట్టిపోస్తారు. ఎవరిని లెక్క చేయరు.. అందుకే తరచూ వివాదాల్లో కూరుకుపోతుంటారు. ఇప్పుడు కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ నటి నౌషీన్ షా(Nausheen Shah) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ గురించి అవగాహన లేకుండా కంగనా మాట్లాడుతుందని మండిపడింది. చెంపదెబ్బలు(Slap) కొట్టేందుకు కంగనాను కలవాలని ఉందని చెప్పింది. మోమిన్ సాకిబ్‌తో హద్ కర్ ది షోలో పాల్గొన్న నౌషీన్‌ను బాలీవుడ్ తారలను ఎవరైనా కలవాలని అనుకుంటున్నారా? అని ప్రశించారు హోస్ట్. దానికి ఆమె జవాబిస్తూ కంగనాను కలవాలని ఉందని, ఆమెను చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నానని చెప్పింది. 'కంగనా నా దేశం గురించి మాట్లాడే పద్దతి బాగుండదు. నా దేశ సైన్యం గురించి ఆమె చాలా చెత్తగా మాట్లాడుతుంటుంది. ఏమైనా ఆమె ధైర్యానికి నమస్కరిస్తున్నాను. ఆమెకు జ్ఞానం లేదు. మరో దేశం గురించి మాట్లాడుతుంటుంది. మీ సొంత దేశం, నటన, వివాదాలు, మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌పై దృష్టి పెట్టండి' అంటూ నౌషీన్ షా సూచించింది. ప్రస్తుతం నౌషీన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కంగాన మాత్రం ఇప్పటి వరకు దీనిపై రియాక్ట్ అవ్వలేదు కానీ ఆమె అభిమానులు మాత్రం నౌషీన్‌పై మండిపడుతున్నారు.