పాకిస్తాన్‌ హీరోయిన్‌ మహీరా ఖాన్‌(Mahira Khan) రాయిస్‌(Royce) అనే బాలీవుడ్‌ మూవీలో నటించిన విషయం తెలిసిందే. షారూక్‌ ఖాన్‌(Shahrukh Khan) హీరోగా నటించిన ఈ సినిమా 2017లో విడుదలైన విషయం కూడా తెలిసిందే! ఆ సినిమా షూటింగ్‌ అప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌తో(Ranbir Kapoor) కలిసి మహీరా ఖాన్‌ సిగరెట్‌ తాగుతున్న(Smoking) ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఆమెను దారుణంగా తిట్టారప్పుడు.

పాకిస్తాన్‌ హీరోయిన్‌ మహీరా ఖాన్‌(Mahira Khan) రాయిస్‌(Royce) అనే బాలీవుడ్‌ మూవీలో నటించిన విషయం తెలిసిందే. షారూక్‌ ఖాన్‌(Shahrukh Khan) హీరోగా నటించిన ఈ సినిమా 2017లో విడుదలైన విషయం కూడా తెలిసిందే! ఆ సినిమా షూటింగ్‌ అప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌తో(Ranbir Kapoor) కలిసి మహీరా ఖాన్‌ సిగరెట్‌ తాగుతున్న(Smoking) ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఆమెను దారుణంగా తిట్టారప్పుడు. అప్పటి ఆ చేదు ఘటనను గుర్తు తెచ్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు మహీరా. మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడిన క్షణాలను గుర్తు తెచ్చుకుని బాధపడ్డారు' ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు తలెత్తుకుని తిరగలేకపోయాను. ఎవరికీ సమాధానం చెప్పుకోలేకపోయాను. డిప్రెషన్‌కు(Depression) లోనయ్యాను' అని మహీరా ఖాన్‌ అన్నారు. 'నాపై వచ్చిన విమర్శలు చూసి నేను ఎంతో కలత చెందాను. తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. సోషల్‌ మీడియాలో నన్ను దారుణంగా తిట్టారు. ఎక్కడ చూసినా నాపై విమర్శలే కనిపించాయి. అందరూ తిడుతూ ఉంటే భరించలేకపోయాను. పిచ్చిదాన్ని అయ్యాను. ఒక రోజు ఆందోళనతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. చేతులు వణికిపోయేవి. అందరూ కలిసి నాపై దాడి చేస్తున్నట్టు అనిపించింది. ట్రీట్‌మెంట్‌కు ప్రయత్నించాను కానీ అది వర్కవుట్‌ కాలేదు. ఎంతో మంది డాక్టర్లను కలిశాను. ఎన్నో మందులు వాడాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నిద్రలేని రాత్రులను అనేకం గడిపాను' అని అన్నారు. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడుల ఫలితంగా పాకిస్తాన్‌ నటీనటులు బాలీవుడ్‌లో నటించకూడదనే నిబంధన విధించారు. అప్పటికే తాను రాయిస్‌ సినిమా పూర్తి చేశానని, అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఉరి ఉగ్రదాడి జరిగిందని మహీరా అన్నారు. ఉరి ఉగ్రదాడి తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని, చంపేస్తామంటూ ఫోన్‌ కాల్స్‌ కూడా వచ్చాయని చెప్పారు. అందుకే ఆతను రాయస్‌ సినిమా ప్రమోషన్‌కు వెళ్లలేకపోయానని తెలిపారు. రాయిస్‌ సినిమా పాకిస్తాన్‌లో కూడా విడుదలైతే బాగుండని అనుకున్నానని, ఎందుకంటే షారూక్‌ను అభిమానించేవారు ఇక్కడ కూడా ఉన్నారు అని మహీరా ఖాన్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహీరా ఫర్హాత్‌ ఇష్తీయాఖ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

Updated On 30 Aug 2023 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story